పొద్దున్నే పరగడుపున ఇవి అస్సలు తీసుకోవద్దు?

Purushottham Vinay
మనం నిద్రపోయిన తరువాత మన జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఇంకా అలాగే ఖాళీ కడుపులో హైడ్రో క్లోరిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం చాలా ఎక్కువగా తయారవుతుంది. దీంతో గ్యాస్, కడుపు ఉబ్బరం, అల్సర్ ఇంకా అసిడిటీ వంటి సమస్యలు తలెత్తడంతో పాటు ఉన్న సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. ఇది శరీరానికి ఖచ్చితంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఇంకా అలాగే చాలా మంది గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడే వారు ఈ సమస్య నుండి బయటపడడానికి ఉదయం లేవగానే సోడా వంటి వివిధ రకాల శీతల పానీయాలను తాగుతారు. కానీ ఇలా శీతల పానీయాలను తీసుకోవడం వల్ల గ్యాస్ ఇంకా అసిడిటీ వంటి పొట్ట సంబంధిత సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి.  చాలా మంది కూడా ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కాఫీని తాగుతూ ఉంటారు. ఇది కూడా అస్సలు మంచిది కాదు.


ఎందుకంటే కాఫీ కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరింత ఎక్కువగా తయారయ్యేలా చేస్తుంది. దీంతో పొట్ట సమస్యలు పెరగడంతో పాటు లేని వారికి కూడా సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇంకా అదే విధంగా ఖాళీ కడుపున పుల్లటి జ్యూస్ లను కూడా తాగకూడదు. అలాగే నారింజ, బత్తాయి, ఫైనాఫిల్ వంటి జ్యూస్ లను తాగడం వల్ల పొట్ట సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. ఈ జ్యూస్ లు హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తిని ఈజీగా పెంచుతాయి. అందువల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు మరింత ఎక్కువగా అవుతాయి. ఇంకా అలాగే ఖాళీ కడుపున కారం, మసాలాలు ఉండే ఆహారాన్ని కూడా అస్సలు తీసుకోకూడదు. ఇవి కడుపు సమస్యలను పెంచడంతో పాటు ప్రేగుల ఆరోగ్యాన్ని కూడా దారుణంగా దెబ్బతిస్తాయి. కాబట్టి మనం ఉదయం పూట తీసుకునే ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.మనం ఉదయం పూట తీసుకునే అల్పాహారం పైనే మన రోజంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ అల్పాహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: