తేనెతో ఇలా చేస్తే అందం, ఆరోగ్యం మీ సొంతం?

Purushottham Vinay
తేనె మనకు కలిగే చాలా అనారోగ్య సమస్యలను కూడా ఈజీగా నయం చేయగలదు. మీరు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త తేనె, నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని తాగాలి.దీంతో మీరు గొంతును కూడా పుక్కిలించుకోవచ్చు.ఇలా చేయడం వల్ల గొంతు సమస్యలు ఈజీగా తగ్గుతాయి.అలాగే గొంతు నొప్పి, దురద, మంట, దగ్గు వంటివి తగ్గుతాయి. ఇంకా అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో రెండు టీస్పూన్ల తేనెను కలిపి రోజుకు మూడు సార్లు తాగడం వల్ల దగ్గు ఈజీగా తగ్గుతుంది.ఇంకా దీంతోపాటు ఊపిరితిత్తుల్లో ఉండే మ్యూకస్ బయటకు ఈజీగా వచ్చేస్తుంది. ఇది జలుబును సులభంగా తగ్గిస్తుంది. ఇంకా మంచి ఉపశమనాన్ని అందిస్తుంది.అలాగే తేనె జీర్ణ సమస్యలకు కూడా చక్కగా పనిచేస్తుంది.మనం తేనెను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి భోజనానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. అందువల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది. మాంసాహారం తిన్నప్పుడు జీర్ణమయ్యేందుకు ఈ టిప్ ని పాటించవచ్చు.అలాగే ఈ మిశ్రమం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు.



మలబద్దకం, గ్యాస్‌, అసిడిటీ ఇంకా కడుపు నొప్పి ఉండవు. అన్ని జీర్ణ సమస్యల నుంచి ఈజీగా ఉపశమనం పొందవచ్చు. తేనెను గాయాలు, దెబ్బలు ఇంకా పుండ్లను నయం చేసేందుకు కూడా వాడవచ్చు. వాటిపై తేనెను రోజుకు రెండు సార్లు రాస్తే వెంటనే అవి తగ్గిపోతాయి. ఇంకా తేనెలో యాంటీ మైక్రోబియల్ గుణాలు కూడా ఉంటాయి. అందువల్ల మీకు ఇన్‌ఫెక్షన్లు రావు. అలాగే గాయాలు, పుండ్లు చాలా త్వరగా మానిపోతాయి.ఇంకా అలాగే మొటిమలను తగ్గించేందుకు, చర్మ కాంతిని పెంచేందుకు మచ్చలను తొలగించేందుకు కూడా ఈ తేనె బాగా పనిచేస్తుంది.  కొద్దిగా తేనెను తీసుకుని మీ చర్మంపై నేరుగా రాయాలి. ఆ తరువాత సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా ఒక 15 నిమిషాల పాటు ఉండి కడిగేయాలి. ఇలా ప్రతి రోజూ చేయాలి. అందువల్ల వారం రోజుల్లోనే చెప్పుకోదగిన మార్పు కనిపిస్తుంది. ఇంకా అలాగే చర్మంపై ఉండే దద్దుర్లు ఇంకా దురదలు కూడా తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారి చాలా మృదువుగా ఉంటుంది. ఇది పొడి చర్మం ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: