అల్లం ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు?

Purushottham Vinay
రోజు రోజుకి షుగర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. మారిన మన ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ షుగర్ వల్ల మనం ఇతర అనేక రకాలు అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే జీవితాంతం ఖచ్చితంగా మందులు మింగాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే కొందరిలో మందులు వాడినప్పటికి ఈ డయాబెటిస్ అనేది అదుపులో లేకుండా పోతుంది.ఇలా రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నవారు అల్లాన్ని వాడడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతున్నాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారిపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారికి ప్రతి రోజూ 4 గ్రాముల అల్లాన్ని ఇచ్చి చూడడం వల్ల వారిలో ఫాస్టింగ్ షుగర్ లెవల్స్ తగ్గుతున్నాయని వారు వెల్లడించారు. ఇంకా అలాగే అల్లాన్ని వాడడం వల్ల రక్తపోటు కూడా తగ్గుతుందని ఈ పరిశోధనల్లో వెల్లడైంది. అల్లాన్ని మనం చాలా కాలంగా వంటల్లో ఉపయోగిస్తున్నాము.ఇంకా అలాగే అనేక ఔషధ తయారీలలో కూడా అల్లాన్ని విరివిరిగా ఉపయోగిస్తున్నారు. దీనిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.



అల్లాన్ని వాడడం వల్ల రక్తపోటు ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడంతో పాటు మనం చాలా ప్రయోజనాలను కూడా పొందవచ్చు.నోటి ఆరోగ్యాన్ని మెరుగుపచడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇంకా స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులను తగ్గించడంలో, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా చేయడంలో ఇలా చాలా రకాలుగా అల్లం మనకు సహాయపడుతుంది. అయితే మనం ఎక్కువగా ఈ అల్లాన్ని పేస్ట్ గా చేసి వంటల్లో వాడుతూ ఉంటాము. ఇలా వాడడం వల్ల మనకు అల్లం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి అల్లాన్ని నేరుగా తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించాలి. ఇంకా అలాగే అల్లాన్ని దంచి దాని నుండి రసాన్ని తీసుకుని తాగవచ్చు. ఈ విధంగా టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు ప్రతి రోజూ అల్లాన్ని 4 గ్రాముల మోతాదులో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులోకి వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: