ఫైల్స్ నొప్పికి అరటి పండుతో చెక్ పెట్టండి..!

Divya
ఈ మధ్యకాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ముఖ్యమైన ఆరోగ్య సమస్యల్లో పైల్స్ కూడా ఒకటిగా చెప్పవచ్చు.ఇది ఎక్కువగా ఆహారపు అలవాట్లలో మార్పు కారణంగా వస్తువుంది.ఇది మొదటగా మలబద్ధకం ద్వారా మొదలవుతుంది.దీనికి ప్రధాన కారణం- మారిన జీవనశైలి,ఆహార సమయాల పాటించకపోవడం,నీరు అధికంగా తీసుకోకపోవడం . ఒకవేళ ఆహారం తిన్నా హడావుడిగా ముగించడం, ఎప్పుడూ చిరాకు,కోపంతో పాటు తీవ్ర ఒత్తిడి ఫలితంగా పైల్స్ ఎక్కువమందికి ప్రధాన సమస్యగామారుతోంది.
చాలామంది పైల్స్ సమస్య గురించి ఇతరులతో చర్చించడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.ఇంకా చెప్పాలంటే సిగ్గుతో డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి కూడా వారికి మొహమాటం అడ్డం వస్తువుంటుంది.అయితే ఫైల్స్ సమస్య తీవ్రంగా ఉంటే,తక్షణమే వైద్యుని సంప్రదించడం చాలా మంచిది.దానితో పాటు అరటిపండు తరుచూ తీసుకుంటూ ఉంటే పైల్స్ ని క్రమంగా తగ్గించుకోవచ్చని ఆహారం నిపుణులు సూచిస్తున్నారు.
ఎందుకంటే అరటి పండులోని అధిక కాల్షియం మరియు సోడియం,అధిక ఫైబర్ పైల్స్ సమస్యకు మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.అందుకే అరటి పండ్లను పైల్స్ సమస్యతో బాధపడేవారికి మంచి ఆహారంగా చెబుతారు.పైల్స్ ఉపశమనం కలగడానికి,పైల్స్ రాకుండా ఉండటానికి అరటి పండ్లను ఎలా తీసుకోవాలి,మరియు ఏ సమయంలో తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

అరటి పండ్లలో డైటరీ పైబర్ అధికంగా లభించడం వల్ల,ఆరోగ్యకరంగా ప్రేగు కదలికలను వేగవంతం చేస్తుంది.మనం తిన్న ఆహారంలోని వ్యర్థాల నుండి మలాన్ని మృదువుగా తయారు చేయడంలో ఫైబర్ కంటెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది.ఈ పండులోనే సోడియం మరియు పొటాషియం కంటెంట్ మన పొట్టలోని ప్రేగులు సక్రమంగా కదలికలకు ఉపయోగపడడం వల్ల మనం మైండ్ లో ఒత్తిడి కూడా తగ్గుతుంది.దీనితో పైల్స్ తీవ్రతరం చేసే ప్రమాదాన్ని తగ్గిపోతుంది.అరటిపండులో పొటాషియం,విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు అధికంగా లభిస్తాయి.రోజు ఒక అరటిపండు తీసుకోవడంతో మన జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
మనం తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవ్వడానికి, మరియు అందులోని పోషకాలు మన శరీరానికి అందడానికి పండిన అరటిపండ్లే మంచివని ఆహార నిపుణులు చెబుతున్నారు.కానీ కొంతమంది భోజనం తిన్న వెంటనే అరటిపండు తింటూ ఉంటారు.కానీ ఇది కూడా మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు.భోజనం చేసిన అరగంట తర్వాత అరటిపండు తినడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: