నల్లనేరేడు పళ్ళు తింటే కలిగే లాభాలేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Divya
సాధారణంగా వేసవి మొదలవగానే మామిడి పండ్లు నేరేడుపల్లి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి.మామిడి పండును తిన్నంత ఇష్టంగా నేరేడు పండును తినరు. దీనికి కారణం ఇవి కొంచెం వగరుగా ఉండడమే.కానీ దీనిని ఎక్కువగా తీసుకుంటూ ఉండటం వల్ల దీర్ఘకాళిక వ్యాధులకు సైతం నివారణ కలుగుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ చెట్టు బెరడు నుంచి ఆకుల వరకు ప్రతిభాగంలోనూ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని పరిశోధన చేసి మరీ నిరూపించారు.అటువంటి నేరేడుపల్ల వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహ రోగులు వీటిని తరచూ తీసుకోవడంతో, ఇందులోని యాంటీ డయాబెటిక్ గుణాలు వారి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి.డయాబెటిస్ కి మందులు తీసుకునేవారు,నేరేడు విత్తనాల పొడిని,గ్లాస్ నీటిలో కలుపుకొని తాగడం వల్ల వారి మధుమేహాన్ని క్రమంగా తగ్గించుకోవచ్చు.అంతేకాక సంతానలేమి సమస్యలతో బాధపడే భార్య భర్తలు ఇద్దరూ నేరేడు విత్తనాల పొడిని తరచూ తీసుకోవడం వల్ల మగవాళ్లలో శుక్రకణాల కౌంటని పెంచుతుంది.స్త్రీలలో సరైన రుతుక్రమణ సమయంలో అండాలు సరిగా రిలీజ్ అయ్యి సంతాన సమస్యలు తొలగిపోతాయి.
ఇందులోని విటమిన్ సి సీజనల్ వ్యాధులు రాకుండా పోరాడే మన రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.దీనితో సీజనల్గా వచ్చే దగ్గు,జలుబు,విరేచనాలు వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
వేసవిలో అధికంగా వచ్చే విరేచనాలు నీరసం వాంతులు వంటివి తగ్గించుకోవడానికి నేరేడు పళ్ళు చాలా బాగా ఉపయోగపడతాయి.వీటిని తీసుకున్న వెంటనే తక్షణ శక్తి వస్తుంది.తరచుగా పిల్లలకు సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల,వారీ జీవక్రియ రేటు పెరిగి,ఎదుగుదల సక్రమంగా ఉంటుంది.మరియు ఇందులోని మెగ్నీషియం గుండా కండరాలు బలి దృఢంగా తయారయ్యేందుకు ఉపయోగపడి,గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది.కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు,నేరేడు ఆకుల రసాన్ని రెండు స్పూన్ల మోతాదులో తీసుకొని,అందులో ఒక స్పూన్ తేనె కలిపి,రోజు పరగడుపున తీసుకోవడం వల్ల, కిడ్నీలో రాళ్లు క్రమంగా కరిగి,యూరిన్ తో పాటు బయటకు వచ్చేస్తాయి.కావున నేరేడు పళ్ళను తీసుకోవడం అసలు మానకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: