పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచాలి అనుకుంటున్నారా..?
బెడ్స్ సర్దడం..
ఎవరి పనులు వారు చేసుకోవడం అలవాటు చేయడానికి బెడ్ నుంచి మొదలుపెట్టాలి.యుక్త వయసు వచ్చేలోపు ఇల్లు శుభ్రం చేసుకోవడం,వారి స్కూల్ బ్యాగ్స్ సర్దుకోవడం,తిన్న బాక్స్ లు కడుక్కోవడం,యూనిఫాం, షూస్ క్లీన్ చేసుకోవడం వంటివి అలవాటు చేయాలి.ఇలా చేయడం వల్ల వారు ఎవరి మీద డిపెండ్ కాకుండా ఉంటారు.దీంతో వారిలో కాన్పిడెన్స్ పెరగడం మొదలవుతుంది.
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అలవాటు చేయడం..
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అలవాటు చేయడం వల్ల,స్కూల్ నుండి ఇంటికి వచ్చే దారిలో రకరకాల విషయాలను గమనిస్తూ,వారికి ఇచ్చిన డబ్బులను ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు.ఇలా కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి.
కుకింగ్..
నెమ్మదిగా కుకింగ్ అలవాటు చేసుకోవడం వల్ల,పెద్దవారు ఇంట్లో లేనప్పుడు,చిన్న చిన్న వంటలు వండుకొని,వారి ఆకలిని తీర్చుకోవడం వల్ల కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
సరుకులు తేవడం..
చిన్న,చిన్న కూరగాయల మార్కెట్ కు,కిరాణా షాపులకు పంపించి వస్తువులు తీసుకురమ్మని చెప్పడం వల్ల,ఏ వస్తువు ఎంత ధరకు తీసుకోవాలో,డబ్బులు ఎలా వినియోగించాలో వారికి అవగాహన కలుగుతుంది.మరియు ఆహారం వృధా చేయకూడదని కూడా తెలుస్తుంది.
ఫోన్ నెంబర్స్..
చిన్నపిల్లలకు తల్లిదండ్రులు మరియు ముఖ్యమైన వారి ఫోన్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల,వారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తమని తాము కాపాడుకుంటారు.
భావవ్యక్తీకరణ..
పిల్లలు తమ ఆలోచనలు,అభిప్రాయాలూ వ్యక్తపరిచేలా తర్పిదును ఇవ్వాలి.స్కూల్ కాంపిటీషన్లలో పాల్గొనేలా ఎంకరేజ్ చేయాలి.దీనివలన వారిలో కాన్ఫిడెన్స్ పెరిగి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి.