మధుమేహులు మామిడి పండ్లు ఎలా తినాలో తెలుసా..?

Divya
వేసవి మొదలవగానే మామిడి పళ్ళు అధికంగా లభిస్తాయి.సాధారణంగా మామిడిపండు రుచిని ఎంజాయ్ చేయలేని వారంటూ వుండరు.కానీ మధుమేహులు మామిడి పండ్లను తీసుకోవడానికి సందేహిస్తూ ఉంటారు.వాటి వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ పెరుగుతాయేమోనని బయపడుతుంటారు.అలాంటి వారు మామిడి పండ్లు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంవల్ల,వారు కూడా మామిడిపళ్ళ రుచిని ఎంజాయ్ చేయొచ్చు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా..
మధుమేహలు మామిడి పండ్లు తినేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు..
1.షుగర్ ఉన్నవారు మామిడిపండు తినేటప్పుడు తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం ఉత్తమం.ఇందులో ఉన్న విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి కాబట్టి, వారి ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయి.
2.వీరు అతిగా పండిన పండ్లను తీసుకోకూడదు.వాటిలో గ్లైసేమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది.కావున ఇందులోని చక్కెరలు రక్తంలోకి తొందరగా కలిసిపోయే అవకాశం ఉంటుంది.దానితో వారి మదుమేహం పెరిగే అవకాశాలు ఉంటాయి.కాబట్టి పచ్చిగా ఉన్న మామిడి పండ్లును తీసుకోవడం చాలా ఉత్తమం.
3.మామిడి పండ్లలోని అధికంగా ప్రోటీన్ లభిస్తుంది. కావున ఇది రక్తం షుగర్ ని శోషించుకోవడానికి అడ్డుపడుతుంది.
4. మామిడి పండ్లను మాగ పెట్టడానికి కొన్ని రకాల రసాయనాలు కలుపుతూ ఉంటారు.అలాంటి వాటిని మధుమేహలు తినడం వల్ల, వారి అనారోగ్యం తీవ్రతరం కావచ్చు.కావున వీరు సహజంగా పండిన మామిడి పండ్లను మాత్రమే తీసుకోవడం ఉత్తమం.
5. మధుమేహంతో బాధపడే వారు మామిడి పండ్లను తిన్న వెంటనే, వారు షుగర్ లెవెల్స్ ని అబ్జర్వ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మామిడి పండు తిన్న తర్వాత వారి షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గులకు గురి అవుతూ ఉంటే,మామిడి పండ్లు తినకపోవడం చాలా మంచిది.
6. షుగర్ ఉన్నవారు మామిడిపళ్ళ జ్యూస్ లేదా స్మూతీలకు దూరంగా ఉండటం చాలా మంచిది.దీనికి కారణం మామిడి పండ్లజ్యూస్ తాగడం వల్ల,ఇందులో ఉన్న షుగర్స్ డైరెక్ట్ గా రక్తంతో కలిసిపోతాయి. దానితో వారి గ్లూకోస్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కావున వారు పండ్ల రూపంలో తీసుకోవడమే,వారి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: