ఈ ఆకులు తిన్నారంటే భవిష్యత్తులో షుగర్ రమ్మన్నా రాదు..!!

Divya
ఇప్పుడున్న జీవనశైలి ఆహారపు అలవాట్లు కారణంగా ఎంతోమంది మధుమేహం బారిన పడుతున్నారు. ఈ మధుమేహం వల్ల కేవలం రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగడమే కాకుండా అనేక అవయవాలు అనారోగ్యం పాలు అవుతున్నాయి. అందులో ముఖ్యంగా గుండెపోటు,మూత్రపిండాలు దెబ్బ తినటం, కంటిచూపు మందగించడం , అల్జీమర్ మొదలగునవి చుట్టుముడుతున్నాయి. మరి కొంతమందిలో షుగర్ ముదిరి చావు వరకు వెళ్తున్నారు.దీని కారణంగా మధుమేహం అంటే భయపడాల్సి వస్తోంది.కనుక ప్రతి ఒక్కరు సరైన ఆహారం అలవాట్లతో, జీవన శైలి అలవర్చుకోవడంతో పాటు కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాలకు నెలవైన ఆకులను తినడం వల్ల, రక్తంలోని ఇన్సులిన్ అదుపులో ఉంచుకొని,భవిష్యత్తులో షుగర్ రాకుండా కాపాడుకోవచ్చు అని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.అలాంటి ఆకులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
వేపాకు:
వేపాకు సుగుణాల గురించి అందరికీ తెలిసిందే. వేపాకులు పరగడుపునె నమలి మింగడం వల్ల, ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కడుపులోని చెడు బ్యాక్టీరియా నశించి చేయడమే కాక, క్లోమం పనితీరును మెరుగుపరిచి, ఇన్సులిన్ ఉత్పత్తిని  పెంచుతుంది. దీనితో రక్తంలోని షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచి మధుమేహం రాకుండా సహాయపడుతుంది.మరియు ఇందులోని యాంటీ ఫంగల్ లక్షణాలు తామర, పుండ్లు, దురదలు వంటి ఎన్నో రకాల అలర్జీలను కూడా దూరం చేస్తుంది.
కలబంద ఆకులు :
కలబందనలోని ఔషధ గుణాల వల్ల దీనిని ఆయుర్వేద చికిత్సలో బాగా ఉపయోగపడుతుంది.మరియు దీనిని పెంచుకోవడం కూడా చాలా సులభం.మధుమేహ చికిత్స కోసం, కలబంద ఆకులను బాగా కడిగి, ఒక మాత్ర సైజులో రోజు తీసుకోవడం వల్ల ప్యాంక్రియాజ్ లో ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరిగి,రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా సహాయపడి,మధుమెహన్ని దరిచేరనివ్వదు.మరియు ఆరోగ్యానికి కాక అందానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.
సీతాఫలం ఆకులు :
సీతాఫలం ప్రతి ఒక్కరికి ఇష్టమైనవి.సీతాఫలం ఆకుల యొక్క రసం రోజు పరగడుపునే తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ డయాబెటిక్ లక్షణాలు  క్లోమంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి,రక్తంలోని చక్కెరలను క్రమబద్ధీకరించి షుగర్ రాకుండా కాపాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: