మీకు తరుచూ వేడి చేస్తోందా..!అయితే సొరకాయ జ్యూస్ తాగాల్సిందే..

Divya
కొన్ని కూరగాయలలో సహజ సిద్ధంగానే నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాటిల్లో సొరకాయకు ఒకటి. ఇందులో ఎలాంటి హానికరమైన రసయనాలు ఉండవు. ఎందుకంటే సొరకాయను ఎలాంటి రసాయనాలు లేకుండానే పండుతుంది.సొరకాయలో అధికపైబర్, నీటి శాతం,ఐరన్, పొటాషియంతోపాటు విటమిన్‌ ఏ, సి, ఈ పుష్కళంగా  ఉంటాయి.వీటిని తరుచు తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయో ఇప్పుడు చూద్దాం..
అధిక వేడిని తగ్గించడానికి..
సాధారణంగా చాలా మందికి సీజన్ తో పని లేకుండా వేడి చేస్తూ ఉంటుంది.అలాంటి వారికి సొరకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. సొరకాయను జ్యూస్ చేసుకొని తరుచూ తీసుకోవడం వల్ల,అందులోని అధిక నీరు శరీరంలోని వేడిని యూరిన్ రూపంలో బయటకు నెట్టి వేస్తుంది. దీనిటీ అధిక వేడిని తొందరగా తగ్గించుకోవచ్చు.అంతే కాక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.
నిద్ర లేమి తగ్గించుకోవడానికి..
సాధారణంగా చాలా మంది ఎంతకీ నిద్ర పట్టక బాధపడుతుంటారు. అలాంటి వారికి సొరకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది.దీనిలో సహజసిద్ధంగా ఉన్న మత్తు కలిగించే గుణం ఉండటం వల్ల,ఒత్తిడి, అలసట తగ్గడంతో పాటు తొందరగా నిద్రపోతారు. సొరకాయను తమ డైట్ లో చేర్చుకోవడం వల్ల , చిన్న వయసులోనే జుట్టు తెల్ల బడకుండా కాపాడుతుంది.మరియు ఆయిల్ స్కిన్ కలవారికి, జిడ్డు కారడం తగ్గించడంలో సహాయం చేస్తుంది.
రక్త ప్రసరణ పెంచుకోవడానికి..
ఇందులోని విటమిన్ కె రక్త నాలాల్లో రక్తం గడ్డ కట్టకుండా చేసి, రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. దీనితో గుండె పై ఒత్తిడి తగ్గి, గుండె పనితీరు మెరుగుపడుతుంది. అధిక బీపి తో ఇబ్బంది పడేవారు రోజూ సొరకాయను ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా మంచిది.
జీర్ణశక్తిని పెంచుకోవడానికీ..
సొరకాయను అధికంగా తీసుకోవడం వల్ల ఇందులోని అధికంగా వున్న పైబర్ జీర్ణ క్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. దీనితో శరీరంలో వేస్ట్ ను బయటకు పంపివేయడంలో సహాయ పడి అధిక బరువు పెరగకుండా కాపాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: