ఆరోగ్యం, అందం కోసం దీన్ని తీసుకోవాల్సిందే?

Purushottham Vinay
జీర్ణ సమస్యలు ఇంకా అలాగే హైపర్‌ ఎసిడిటీ ఉన్నవారికి మెంతి గింజలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ మెంతి గింజల పేస్ట్‌లో తురిమిన అల్లం వేసి, భోజనానికి ముందు ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే జీర్ణ సమస్యలు చాలా ఈజీగా తగ్గుముఖం పడతాయి. ఇంకా అలాగే ఈ మెంతి నీటిని పరిగడుపున తీసుకుంటే పేగులు కూడా బాగా శుభ్రపడి వ్యర్థాలు అన్ని కూడా బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా పొట్ట లైట్ అవుతుంది. ఇంకా అలాగే మొలకెత్తిన మెంతి గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ప్రక్రియను కూడా నెమ్మదింపజేస్తాయి. అలాగే మీ చర్మాన్ని తేమగా ఉంచుతాయి.ఇక మెంతి గింజల పేస్ట్‌ను తేనెతో కలిపి రాత్రి మీ ముఖానికి రాసుకుని, ఉదయాన్నే శుభ్రంగా కడిగాలి. ఇలా చేయడం వల్ల అందమైన మెరిసే చర్మాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. మెంతి గింజల పేస్ట్‌తో తయారు చేసిన ఫేస్ మాస్క్, శెనగపిండి ఇంకా పెరుగుతో కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ లా రాసుకుంటే నల్ల మచ్చలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి.



అలాగే మెంతి కూరను టమోటా, పప్పుతో కలిపి వండుకుంటారు. అయితే మెంతి గింజలను నానబెట్టి తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెంతి గింజల నీటిని ప్రతిరోజూ కూడా ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జీవక్రియ సక్రమంగా పనిచేస్తుంది. ఇది బరువు తగ్గేందుకు కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఇంకా అలాగే ఆకలిని నియంత్రించడంతో పాటు కేలరీల అవసరాన్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్‌ అధిక మొత్తంలో ఉంటుంది. మెంతి గింజలు మధుమేహాన్ని నిరోధించడానికి కూడా చాలా అద్భుతంగా పని చేస్తుంది. ఇది ఇన్సులిన్ చర్యను బాగా వేగవంతం చేస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. మెంతి గింజల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మహిళల్లో ఋతు చక్రంతో సమస్యలు ఇంకా అలాగే ఇబ్బందులను అరికడతాయి. ఇంకా అలాగే వీటిలో ఉండే ఆల్కలాయిడ్స్ నొప్పిని తగ్గిస్తుందని నమ్ముతారు. మెంతి గింజల పొడిని తీసుకోవడం వల్ల తిమ్మిరి వచ్చే సమస్యను తగ్గిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: