ఈ అలవాటు ఉంటే లైంగిక సమస్యలు తప్పవు?

Purushottham Vinay
ఇక శారీరకంగా బలహీనతతో ఉంటే వైవాహిక జీవితంలో ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతుంది. ఇంకా పురుషులు తండ్రులుగా మారడంలో ఎన్నో సమస్యలు ప్రారంభమవుతాయి. ఇక పురుషుల్లో వంధ్యత్వ సమస్య రోజురోజుకు పెరుగుతున్నా.. చాలామంది పురుషులు కూడా అసలు ఈ సమస్య గురించి ఎవరితోనూ పంచుకోరు. పురుషుల్లో వంధత్వానికి సంబంధించిన చెడు అలవాట్లలో ముఖ్యమైనది ఏంటంటే మద్యం సేవించడం..ఇక ఇది ప్రస్తుత కాలంలో లైఫ్‌స్టైల్‌ ట్రెండ్‌గా మారింది. కానీ, మనలో చాలా మందికి కూడా మద్యం తాగడం వల్ల కలిగే హాని గురించి తెలిసినా పట్టించుకోరు. మద్యం పురుషుల్లో వంధ్యత్వ సమస్యకు ఎలా కారణమవుతుంది ఇంకా ఏ విధంగా లైంగిక సామార్థ్యంపై ఎలా ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకోండి..ఆల్కహాల్ తాగడం అనేది అన్ని విధాలుగా చాలా హానికరం. దీనివల్ల కాలేయం దెబ్బతినే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇంకా అన్ని రకాల సమస్యలను కూడా కలిగిస్తుంది. అయితే ఆల్కహాల్ పురుషుల సంతానోత్పత్తిపై చాలా గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని అందరికీ తెలియదు. ఈ ఆల్కహాల్ తాగడం వల్ల స్పెర్మ్ కౌంట్ పడిపోవడమే కాకుండా దాని నాణ్యత కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.


ముఖ్యంగా ఎక్కువ తాగే వారికి ఈ రిస్క్ కూడా అంతే పెరుగుతుంది. కావున ఈ వ్యసనాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే మీ ఆరోగ్యానికి అంత మంచిది.ఈ ఆల్కహాల్ తాగడం వల్ల లైంగిక జీవితం ఎలా ప్రభావితం అవుతుందో తెలుసుకోండి..ఇంకా ఈ మద్యపానం పురుషుల సంతానోత్పత్తిపై చెడు ప్రభావాన్ని చూపడమే కాకుండా ఇంకా అలాగే లైంగిక సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.ఈ ఆల్కహాల్ తీసుకోవడం టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది. ఇంకా అలాగే స్పెర్మ్ ఏర్పడటానికి దోహదపడే హార్మోన్ల సమతుల్యతను మరింత దిగజార్చుతుంది. ఈ ఆల్కహాల్ ప్రభావం కారణంగా, ఆరోగ్యకరమైన స్పెర్మ్, ఆకార పరిమాణం ఇంకా ప్రయాణ శక్తి తగ్గడం ప్రారంభమవుతుంది.అలాగే ఆల్కహాల్ తాగడం వలన వృషణాల పరిమాణం తగ్గిపోతుంది. ఇది నేరుగా పురుషుల సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది.అలాగే ఆల్కహాల్ తాగడం వల్ల స్ఖలనం తగ్గుతుంది లేదా అకాల స్కలనం ప్రమాదాన్ని పెంచుతుంది.కాబట్టి ఇలాంటివారు ఆల్కహాల్ తాగడం మానేస్తే.. ఇక 3 నెలల్లో ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తి దానంతటదే ప్రారంభమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: