లైఫ్ స్టైల్: వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి ఉపశమనం పొందాలంటే..?

Divya
ఇక వర్షాకాలం మొదలైంది.. పైగా సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు. కొంతమందికి సీజన్ బట్టి వ్యాధులు కూడా చుట్టముడుతూ ఉంటాయి. అలాంటి వారు ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరం , గొంతు నొప్పి , గొంతు ఇన్ఫెక్షన్ వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. ఇకపోతే వీటిని ప్రారంభ దశలో ఉన్నప్పుడే తగ్గించుకుంటే చాలా మంచిది లేకపోతే తీవ్రంగా సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న చిట్కా మీరు పాటించినట్లయితే ఇలాంటి సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
ఈ చిట్కా కోసం కావలసిన పదార్థాలు చిన్న సొంటి ముక్క ఒకటి.. కొన్ని మిరియాలను మెత్తగా పొడి చేయాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ..ఒక గ్లాస్ నీటిని పోసి అందులో ఒక టేబుల్ స్పూన్ టీ పొడి, ఒక టేబుల్ స్పూన్ పంచదార అలాగే రెడీ చేసి పెట్టుకున్న మిరియాల, సొంటి ముక్కల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసి ఐదు నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ పాలను పోసి మరొక ఐదు నిమిషాలు మరిగించాలి. ఇక తర్వాత వడకట్టి తాగడం వల్ల మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి వెంటనే తలనొప్పి, జలుబు , దగ్గు, గొంతు నొప్పి వంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఇకపోతే సొంటిలో మనకు ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. అంతే కాకుండా సోడియం,  మెగ్నీషియం,  ఫైబర్,  జింక్ , ఫోలేట్ ఆమ్లం , కొవ్వు ఆమ్లాలు,  కాల్షియం,  విటమిన్ ఏ , విటమిన్ సి,  ఐరన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఇది మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ముఖ్యంగా వంటింట్లో సహజసిద్ధంగా లభించే వాటితోనే మీరు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. కాకపోతే కాస్త సమయాన్ని కేటాయించి ఇలాంటివి తయారు చేసుకోవడం వల్ల మీ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: