తలనొప్పి: చిటికెలో తగ్గాలంటే ఇలా చెయ్యండి?

Purushottham Vinay
తలనొప్పి వెనుక అనేక కారణాలు ఉంటాయని చెబుతున్నారు. విపరీతమైన ఒత్తిడి, శరీరంలో నీరు లేకపోవడం ఇంకా నిద్రలేమి వంటి సమస్యల వల్ల తలనొప్పి వస్తుంది. ఇక ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే.. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఇది తీవ్రమైన సమస్యగా మారే అవకాశం అనేది ఉందంటున్నారు. ఉదయం పూట నిద్ర లేవగానే వచ్చే తలనొప్పికి కారణమేంటి? ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి? అనే ప్రశ్నలకు ఇక్కడ కొన్ని పరిష్కార మార్గాలు చూద్దాం.ప్రధానంగా శరీరంలో రక్త లేమి సమస్య కారణంగా ఈ తలనొప్పి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా అదే సమయంలో శరీరంలో ఆక్సిజన్ కొరత వల్ల కూడా ఈ తలనొప్పి సమస్యలు వస్తాయి.అలాగే రక్తంలో చక్కెర స్థాయి అసాధారణంగా ఉంటే కూడా తలనొప్పి సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తలనొప్పి అనేది మార్నింగ్ సిక్ నెస్ లక్షణం.ఉదయం పూట లేవగానే తలనొప్పి విపరీతంగా ఉన్నట్లయితే.. మీరు షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.


సాధారణంగా చాలా మంది రాత్రిపూట ఇంకా నిద్రవేళలో తక్కువ నీరు తాగుతారు. ఇలాంటి సమయంలో ఉదయం పూట నిద్ర లేవగానే తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో నీరు అనేది లేకపోవడమే.ఉదయం పూట నిద్ర లేవగానే సరిపడా నీళ్లు తాగకపోతే తలనొప్పి వస్తుంది.నిద్ర లేకపోవడం వల్ల కూడా ఉదయం పూట తలనొప్పి వస్తుంది. ఇంకా అదే సమయంలో చాలా మందికి ఒత్తిడి కారణంగా తలనొప్పి వస్తుంది. అలాగే నైట్ డ్యూటీ చేసేవారు తలనొప్పితో బాధపడే అవకాశం ఉంది.ఇక ఉదయం నిద్ర లేవగానే చల్లటి నీళ్లకు బదులు.. గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం కనుక కలిపి తాగితే తలనొప్పి రాకుండా ఉంటుంది. తలనొప్పి తగ్గడానికి కాస్త విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. కంటికి సరిపడా నిద్ర, యోగా, ఇంకా అలాగే మెడిటేషన్ వల్ల తలనొప్పి సమస్యను తగ్గించుకోవచ్చు. ఏదైనా కారణం వల్ల తలనొప్పి తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: