మంచంపై తింటే ఎంత అనర్ధమో తెలుసా?

Purushottham Vinay
ఇక చాలా మంది కూడా ఎక్కువగా మంచం మీద కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. అది అసలు మంచిది కాదని పెద్దలు చెప్పినా సరే అలా వారు మంచం మీద కూర్చొని భోజనం చేయడం మాత్రం ఆపే అవకాశమే ఉండదు. అయితే పూర్వం పెద్దలు చెప్పిన ఎన్నో విషయాలకు మంచి మంచి ఉద్దేశాలు ఉన్నా సరే వాటిని అర్ధం చేసుకోవడంలో మాత్రం ఈ తరం వాళ్ళు చాలా ఎక్కువగా ఫెయిల్ అవుతున్నారు.అసలు మంచం మీద కూర్చుని అన్నం ఎందుకు తినకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం .మనం ఏదైనా ఆహారం కనుక తీసుకుంటే. మనం ఏమైనా తిన్నప్పుడు కొంతైనా సరే అది కింద పడుతూ ఉంటుంది. ఇక మనం దాన్ని శుభ్రం చేయడం అనేది జరుగుతుంది. అది మంచం మీద తిన్నప్పుడు కూడా అలాగే జరుగుతుంది. మంచాన్ని ఎంత జాగ్రత్తగా శుభ్రం చేసినా సరే అది సరిగా శుభ్రం అయ్యే అవకాశం అనేదే లేదు. ఆహారపదార్థాలకు సంబంధించిన చిన్న చిన్న ముక్కలు మంచం లో ఇరుక్కపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.

ఇక ఆ విధంగా ఇరుక్కుపోయిన వాటిని తినడానికి చీమలు గాని ఎలుకలు గాని ఇతర క్రిమి కీటకాలు మంచం లో చేరే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాటి కారణంగా కొన్ని అనర్ధాలు అనేవి జరగడం లేదా నిద్రా భంగం జరగడం అనేది అవుతుంది. ఈ ఉద్దేశంతో మంచం మీద తినడం మంచిది కాదు అంటారు పెద్దలు.ఇంకా అలాగే ఆరోగ్యం బాగా లేని వాళ్లకు చాలా మంది ఎక్కువగా మంచం మీదనే కూర్చోబెట్టి భోజనం పెడుతూ ఉంటారు. ఇక ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు పూర్వం కింద కూర్చుని భోజనం చేసే వాళ్ళు. ఇప్పటి మాదిరిగా బద్ధకం లాంటి సమస్య అప్పుడు అసలు ఉండేది కాదు. కాబట్టి మంచం మీద కూర్చుని ఆహారం కనుక తింటే అనారోగ్యంగా ఉన్న వారు అని గుర్తు. ఇవన్నీ చెప్తే అసలు వినరు కాబట్టి అలా తినడం అసలు మంచిది కాదని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: