గుడి బయట చెప్పులు ఎందుకు.. వదులుతారో తెలుసా?

praveen
సాధారణంగా ప్రతి ఒక్కరూ రోజూ కాకపోయినా అప్పుడప్పుడూ అయినా గుడికి వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా గుడికి వెళుతున్న సమయంలో ఎంతో పవిత్రంగా ఉంటారు భక్తులు. అంతేకాదు ఎంత సంపన్నులు అయినా సరే గుడి దగ్గరకు చేరుకోగానే వారి పాదరక్షలను అక్కడే వదిలేసి గుడి లోపలికి వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఇలాంటిదే చేస్తూ ఉంటారు. కానీ ఇలా గుడి బయట చెప్పులు ఎందుకు వదిలేస్తారు అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు.

 అయితే ఒకప్పుడు గుడి బయట పాదరక్షల కోసం ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించేవారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా పాదరక్షలను అక్కడే వదిలేసే వారు. ఇటీవలి కాలంలో మాత్రం గుడి బయట పాదరక్షలను వదిలేయడం కూడా ఒక బిజినెస్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇలా గుడి బయట చెప్పులు వదిలేయడానికి వెనుక చాలానే కారణాలు ఉన్నాయట. పూర్వం చెక్క చెప్పులు ఎక్కువగా వాడేవాళ్ళు. గుడి పూజ ప్రదేశం కాబట్టి ఇక అక్కడ చెప్పులతో తిరిగితే శబ్దం వల్ల గుళ్లో వేదమంత్రాలు సరిగ్గా వినిపించవు అనే  కారణంతో చెప్పులు బయట విప్పి వచ్చేవారట.

 ఇక మరో కారణం చూస్తే మనం కాళ్లు నేలకు ఆనించాల్సి ఉంటుంది. దానికి కారణం గుడిలో వేదపఠనం వల్ల ఉన్న వైబ్రేషన్స్ మన శరీరంలోని అవయవాలు సరిగా పని చేసే విధంగా ఉపయోగపడతాయి అని మరి కొంతమంది చెబుతున్నారు. ఇక మరో వైపు చూసుకుంటే రహదారుల వెంట కుక్క పిల్ల లాంటి ఎన్నో రకాల జంతువులను మలమూత్ర విసర్జన చేస్తే.. అది గమనించకుండా పాదరక్షలతో తొక్కడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అందుకే వాటితో ఆలయం లోకి వస్తే అపవిత్రం అవుతుందనే ఇక అనాదిగా ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారట. అయితే భక్తులు ఎవ్వరూ కూడా ఇబ్బంది అనుకోకుండా ఇలా గుడి బయట పాదరక్షలు వదిలేసి ఇక దేవుడి దర్శనం చేసుకోవడానికి ఇష్టపడతారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: