లైఫ్ స్టైల్: సపోటా పండ్ల వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..?

Divya
ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏదో రకం పండు మనం తినాల్సి ఉంటుంది అని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా సపోటా పండ్లు కూడా ఒకటి. ముఖ్యంగా సపోటా పండ్లను తినడం వల్ల మనకు కావలసిన విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా శరీరానికి లభిస్తాయి. అంతేకాకుండా వీటి వల్ల కలిగే ప్రయోజనాలు మన శరీరానికి పూర్తిస్థాయిలో లభిస్తాయని చెప్పవచ్చు. ఇక శరీరాన్ని ఎప్పటికప్పుడు ఉత్తేజబరితంగా చేయడానికి సపోటా పండ్లు చాలా బాగా పనిచేస్తాయి . ముఖ్యంగా నీరసంగా అనిపించేవారు ప్రతిరోజు రెండు నుండి మూడు పండ్లు తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.
ముఖ్యంగా సపోటా పండ్లలో ఫైబర్ పరిమాణం అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు . ఇక అంతే కాకుండా సపోటా పండ్లు క్రమం తప్పకుండా తింటే మనకు విటమిన్ b6, ప్రోటీన్స్, పోలేట్, కొవ్వులు, విటమిన్ సి ,ఐరన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్ వంటి పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. కంటి చూపు మెరుగు పరచడానికి సపోటా పండ్లలో ఉండే పోషకాలు చాలా బాగా సహాయపడుతాయి. రక్తహీనత సమస్యలు దూరం చేయడంతో పాటు జీర్ణక్రియను మెరుగు పరచడానికి సపోటా పండ్లు సహాయపడతాయి.
పిల్లలకు రోజువారి ఆహారంతో పాటు ఒక సపోటా పండు ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యులు చెబుతున్నారు. సపోటా పండ్లు తినడం వల్ల చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. గుండె సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా వైద్యుడు సలహా మేరకు సపోటా పండ్లను తీసుకోవాలి. సపోటా పండ్లలో తేనె వేసుకొని ఉదయంపూట తినడం వల్ల పురుషులలో వచ్చే టెస్టోస్టిరాన్ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇకపోతే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని అతిగా తింటే మాత్రం పొట్టకు సంబంధించిన సమస్యలు వస్తాయి. కాబట్టి ఆరోగ్య నిపుణులు సలహా మేరకు తీసుకోవాలి. ఇక బాలింతలు సపోటా పండ్లు కు దూరంగా ఉండటం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: