లైఫ్ స్టైల్: వర్షాకాలంలో కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నియమాలు పాటించాల్సిందే..!!

Divya
మరికొద్ది రోజుల్లో వర్షాకాలం మొదలవబోతున్న నేపథ్యంలో ముందుగానే మనం జాగ్రత్తలు పాటిస్తే సీజనల్ గా వచ్చే వ్యాధులను దూరం చేసుకోవచ్చు. ఇక వర్షాకాలం ఆనందాన్ని తీసుకురావడంతో పాటు అనేక జబ్బులను కూడా తీసుకొస్తుంది. ఇకపోతే సిగ్నల్ ఫ్లూ, వైరల్ ఫీవర్, ఇన్ఫెక్షన్స్ , అలర్జీలు , జలుబు ఇలా రకరకాలుగా సీజనల్ వ్యాధులూ చుట్టుముడతాయి. ఇకపోతే ఈ వ్యాధుల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం రోగనిరోధక వ్యవస్థను కూడా బలోపేతం చేసుకోవాలి. మరి ఇలా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి నియమాలు పాటించాలి. ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం.
ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. గుండె వేగంగా పనిచేయడం వల్ల శరీరానికి కావల్సిన రక్తాన్ని సాఫీగా జరిగేలా చేసుకోవచ్చు. ముఖ్యంగా సంతోషాన్ని కలిగించే సెరటోనిన్ హార్మోన్ కూడా మన శరీరం విడుదల చేస్తుంది. ఇక అందుకే ఒకవైపు సంతోషాన్నిస్తోంది. మరొకవైపు రోగనిరోధక వ్యవస్థను దాంతో బ్యాక్టీరియా,  ఇన్ఫెక్షన్ల పై దాడి చేసి రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది.
ఇక ఇతర కారణాలతో పోల్చుకుంటే వర్షాకాలంలో అధికంగా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సూక్ష్మజీవులు ఎక్కువగా అభివృద్ధి చెందకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. తాజా పండ్లు , ముడి ధాన్యాలు,  పప్పు ధాన్యాలు,  కూరగాయలు లాంటివి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా నీళ్ల విరోచనాలు అయ్యేటట్లు ఉంటే ఓ ఆర్ ఎస్ తీసుకోవడం తప్పనిసరి. ఇక వర్షాకాలంలో తప్పకుండా రెండు సార్లు స్నానం చేయాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరంపై పేరుకున్న బ్యాక్టీరియా నశింప బడుతుంది .ఫలితంగా అలర్జీలు, ఇన్ఫెక్షన్లను నియంత్రించవచ్చు. శరీరంపై పేరుకుపోయిన చెమట , మురికిని కూడా దూరం చేసుకోవచ్చు. ఇక దోమతెరలు వాడడం, చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం లాంటి జాగ్రత్తలు వల్ల దోమలు తగ్గి వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: