లైఫ్ స్టైల్: నిమ్మరసం తో ఇలా చేస్తే.. మీ వంటగది అద్భుతః..!!

Divya
సాధారణంగా చాలా మంది మహిళలు తమ వంటగదిని ఎంతో ఇష్టంగా చూసుకుంటూ ఉంటారు. ఉదయం లేచింది మొదలు ఎక్కువ సమయం వారు వంటగదిలోనే తమ సమయాన్ని కేటాయిస్తారు. కాబట్టి వంటగదిని శుభ్రంగా అందంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇకపోతే వంట గదిని ఎప్పటికప్పుడు అందంగా తీర్చిదిద్దుకోవాలి అంటే కొన్ని చిట్కాలు పాటించాలి. మరీ ముఖ్యంగా నిమ్మకాయ తో మన వంటగదిని శుభ్రం చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
ఇకపోతే నిమ్మకాయ అనేది మన ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా జుట్టు, చర్మసంబంధ సమస్యలను కూడా దూరం చేస్తుంది . ముఖ్యంగా ఇందులో ఎన్నో రకాల పోషక విలువలు ఉండడంవల్ల ఆరోగ్య విలువలు కూడా పెరుగుతాయి. ఇకపోతే నిమ్మరసం అనేది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నిమ్మరసం ఉపయోగించి వంటగదిని ఎలా శుభ్రంగా ఉంచుకోవచ్చు ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. వంటగదిలో ఉండే సింక్ ను శుభ్రం చేయాలి అంటే నిమ్మతొక్కలు లేదా నిమ్మరసం లేదా రెండింటిని కలిపి మెత్తగా గుజ్జులా చేయాలి . దీన్ని మొత్తం సింక్ లో వేసి ఐదు నిమిషాల తర్వాత దీని మీద నిమ్మరసం పోసి మరో ఐదు నిమిషాలు నానబెట్టాలి. ఇక కాసేపటి తర్వాత బ్రష్ లేదా ఒక క్లాత్ సహాయంతో శుభ్రంగా రుద్ది నీళ్లతో శుభ్రం చేసుకుంటే సింకు శుభ్రం చేయడమే కాకుండా తళ తళ మెరుస్తూ ఉంటుంది . అంతే కాదు సువాసన కూడా వెదజల్లుతుంది.
ఇకపోతే కిచెన్ లో మనం ఎక్కువగా టవల్స్ ఉపయోగిస్తూ ఉంటాము. ఇక వీటి మీద ఎన్నో రకాల సూక్ష్మజీవులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇకపోతే టవల్ మీద ఉండే జిడ్డు వదిలించడం అనేది  చాలా కష్టం. ముఖ్యంగా టవల్ కి ఉన్న జిడ్డు తొలగించాలంటే నిమ్మరసం చాలా బాగా పనిచేస్తుంది. రెండు చెంచాల నిమ్మరసం కలిపి లీటర్ వేడి నీళ్లలో కిచెన్ లో ఉపయోగించే టవల్ ను ఒక అరగంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత సబ్బుతో ఉతికితే బ్యాక్టీరియా చనిపోవడమే కాకుండా జిడ్డు కూడా వదిలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: