ఉల్లిపాయతో ఇలా చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది!

Purushottham Vinay
ఒక స్పూను ఉల్లి రసం ఇంకా అలాగే ఒక స్పూను తేనె కలిపి తీసుకుంటే అధిక రక్త పోటు సమస్య ఉన్నవారికి కొద్దిగ ఉపశమనం అనేది కలుగుతుంది.ఇక నోటి దుర్వాసన తగ్గడానికి భోజనానంతరము రెండు ఉల్లి కాడలు నమలడం వల్ల నోటి దుర్వాసనను ఈజీగా నివారించుకోవచ్చు.ఇంకా జీర్ణ కోశ శుభ్రతకు అలాగే వ్యాధి నిరోధక శక్తి పెరుగుటకు చాలా మంచిది. ఈ ఉల్లిపాయ ముక్కలు,దోస, టమోట, క్యారెట్, నిమ్మ ఇంకా అలాగే కొత్తి మీర అన్నింటిని సమంగా తీసుకొని బాగా ముద్దగా నూరి కొద్దిగా ఉప్పు కలిపి ప్రతిరోజూ కూడా సేవించాలి.అలాగే జీర్ణకోశం కూడా పరిశుభ్రంగా ఉంటుంది.వ్యాధి నిరోధకత కూడా పెరుగుతుంది. ఇంకా జీర్ణ శక్తి పెరుగుటకు ఈ ఉల్లిపాయలను ముక్కలుగా తరిగి వెనిగర్ తో కలిపి భోజనానంతరం తింటుండాలి. ఇలా చేస్తుంటే ఖచ్చితంగా జీర్ణశక్తి పెరుగుతుంది.అలాగే ఆయాసం, దగ్గు ఇంకా ఆకలి లేకపోవడం తగ్గుటకు ఉల్లి లేదా వెల్లుల్లి రసం - 2 తులాలు ( 20 gm )తేనె - 2 టీ స్పూనులు అల్లం రసం - 1 టీ స్పూను కలిపి భోజనం అయిన తర్వాత తీసుకుంటే జీర్ణశక్తి బాగా మెరుగుపడుతంది.


ఆయాసం , దగ్గు ఇంకా ఆకలి లేకపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. దగ్గు,జలుబు ఇంకా అలాగే టాన్సిల్స్ వాపు తగ్గుటకు ఉల్లి పాయ రసం - 1 టీ స్పూను ఇంకా తేనె - 1 పెద్ద స్పూను పై రెండింటిని కూడా కలిపి  3 భాగాలుగా చేసుకుని పూటకు ఒక భాగం చొప్పున ఇక రోజుకు మూడు పూటలు కూడా సేవిస్తుండాలి.ఇలా చేయడం వలన దగ్గు , జలుబు ఇంకా అలాగే గొంతులో ఉండే టాన్సిల్స్ వాపుకు మంచి మందుగా పని చేస్తుంది.ఇంకా కీళ్ళ నొప్పులు తగ్గుటకు ఉల్లని మెత్తగా నూరి కొద్దిగా వేడి చేసిన తరువాత ఆవ నూనెతో కలిపి కీళ్ళునొప్పులు ఉన్నచోట రాస్తే కీళ్ళ నొప్పులు ఈజీగా తగ్గుతాయి.ఈ రకంగా ఉల్లిపాయలు మన ఆరోగ్యానికి చాలా మేలుని చేస్తాయి. కాబట్టి ఉల్లిపాయాలను మీ డైట్ లో ఖచ్చితంగా భాగం చేసుకోండి. ఇక ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: