స్త్రీ కాలికి మెట్టెలు పెట్టుకోవడానికి గర్భానికి లింక్ ఏంటి ?

VAMSI
పెళ్లైన స్త్రీలు కాలికి మెట్టెలు పెట్టుకుంటారు ఇది మన హిందూ సంప్రదాయం. ముఖ్యంగా భారత దేశంలో ప్రజలు ఇదే నియమాన్ని పాటిస్తారు. ఆడవారు పెళ్లయ్యాక మెడలో తాళి, బొటన వేలు పక్కన వేలుకి మెట్టెలు పెట్టుకోవడం అనేది ఎప్పటి నుండో వస్తున్న ఆచారమే. అయితే ఇప్పుడు మారుతున్న జనరేషన్ చాలా మంది తాళిని పెద్దగా వేసుకోవడం లేదు... కానీ కాలికి మాత్రం మెట్టెలు పెట్టుకుంటున్నారు. కారణం ఏదైనా కాలికి మెట్టెలు తియ్యరు. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం పెళ్లైన స్త్రీలు కచ్చితంగా కాలివేలికి మెట్టెలు పెట్టుకోవడం మన సంప్రదాయం.
కాగ అసలు మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలి..?? అది కూడా ఆడవారు ఎందుకు పెట్టుకోవాలి అంటే మన పురాణాలు ప్రకారమే కాకుండా ఆరోగ్య శాస్త్రం ప్రకారం కూడా పలు కారణాలు ఉన్నాయి.  
గర్భకోశంలోని నరాలకు మరియు కాలి వేలికు సంబంధం ఉంది అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.  
వేలికి మెట్టెలు అంటిపెట్టుకుని ఉండటం వలన అక్కడ మొదలు శరీర భాగాలకు కనెక్ట్ అయ్యి ఉండే నరాల వలన  గర్భ సంబంధమైన సమస్యలు తలెత్తకుండా ఉంటాయట. కాలి బొటన వేళ్ళ ప్రక్కన వుండే వేళ్ళలో బాలచేరు నరములు ఉంటాయట . గర్భధారణ సమయంలో ఈ నరాలు బాగా యాక్టీవ్ అవుతాయట, కాలికి ఉండే మెట్టెలు ఆ నరాలను ఉత్తేజపరుస్తూ వాటిని మసాజ్ చేస్తాయట . తద్వారా ఆ నరాల నుండి కడుపులోని బిడ్డకు కదలికలు వంటివి జరిగి బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందట. అంతేకాదు సంతానలేమి సమస్యతో బాధపడుతున్న పురుషులకు సైతం కాలి వేలికి రాగితీగను మెట్టెలా వేసుకుంటే ఒత్తిడి ఏర్పడి సంతాన భాగ్యము కలిగే అవకాశం ఉంది అని చెబుతున్నారు.
అలా ఒత్తిడి కలిగిస్తే సంతానలేమి సమస్యలు నివారణ అవుతుందని ఒక విశ్వాసం. ఇలా చాలామందికి జరిగింది కూడా.  ఇక కొన్ని విదేశీ సర్వేల ప్రకారం...ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పురుషులతో పోలిస్తే స్త్రీలలో కామవాంఛ ఎక్కువగా ఉంటుందట. అందుకే స్త్రీలు మెట్టెలు ధరిస్తే వారి కోరికలు నియంత్రణలో ఉండే అవకాశం ఉంటుందట.  అంతేకాకుండా కాలి వేళ్ళకు మెట్టెలు పెట్టుకోవడం వలన మనలో ఒత్తిడి కూడా తగ్గుతుందట. ఇలా కాలికి మెట్టెలు పెట్టుకోవడం వెనుక చాలా ఉపయోగకర కారణాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: