
సూర్యుడు భగభగ: వేసవిలోనూ చల్లగా ఉండే ప్రదేశాలివే?
మన దేశంలో వేసవిని ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ గా ఉన్న టూరిస్ట్ ప్రాంతాలు ఇవే..!!
షిల్లాంగ్, డార్జిలింగ్, లద్దాఖ్, ఊటి, మున్నార్ ప్రాంతాలు మన దేశంలో సమ్మ్మర్ సీజన్ లో మంచి టూరింగ్ ప్లేస్ లుగా ఉన్నాయి. ఈ ప్రాంతాలలో వేసవి కాలంలో మండుటెండల్లో సైతం చల్లటి మంచు కురుస్తూ ఉంటుంది. అంతే కాకుండా అక్కడ జల జల పారే జలపాతాలు, సరస్సులు, పచ్చటి అడవి ప్రాంతాలు టూరిస్టులకు మంచి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అందుకే సమ్మర్ వెకేషన్ లో ట్రిప్ వెళ్లాలి అనుకునే వారికి ఈ ప్రాంతాలు బెస్ట్ ఆప్షన్ గా ఉన్నాయి. లోకల్ గా సమ్మర్ సీజన్ ని ఎంజాయ్ చేయాలనుకునే తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిత్తూర్ జిల్లాలో ఉన్న మదనపల్లి లోని హార్సిలీ హిల్స్ బెస్ట్ చాయిస్. ఈ ప్రాంతాన్ని ఆంధ్ర ఊటి అని పిలుస్తారు, అంత చల్లగా ఈ ప్రాంతం సంతోషాన్ని ఇస్తుంది.
అయితే మీరు ఈ సమ్మర్ లో పైన తెలిపిన ప్రాంతాలలో ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారో ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకుని, ముందుగానే బుకింగ్ చేసుకోండి.