గుర్రపు స్వారీ చేయాలనుందా.. అయితే ఇక్కడికి వెళ్ళండి?
అలా చేయాలంటే అవకాశం రావాలి కదా ముఖ్యంగా గుర్రపుస్వారీ ఎలా చేయాలి అన్న విషయం తెలిసి ఉండాలి. హైదరాబాద్ చెన్నై బెంగుళూరు లాంటి మెట్రోపాలిటన్ నగరాల్లో తప్ప సాధారణ ప్రజలకు గుర్రపు స్వారీ చేసే అవకాశం మాత్రం చాలా తక్కువగానే ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం మహబూబ్నగర్ జడ్చర్ల లాంటి నగరాల్లో కూడా గుర్రపుస్వారి శిక్షణ కేంద్రాలు ప్రారంభం అవడంతో ఎంతోమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల దగ్గర నుంచి 50 ఏళ్ల వరకు గుర్రపు స్వారీ చేయాలని ఆసక్తి కలవారు శిక్షణ కేంద్రాలకు బారులు తీరుతున్నారు అని చెప్పాలి.
గుర్రం ఎక్కి స్వారీ చేయాలనుకునే వారికి వారి ఆలోచనలకు అనుగుణంగా శిక్షణ ఇస్తూ ఉంటారు. కేవలం బేసిక్స్ తెలిస్తే చాలు అనుకునే వారికి ఒక రకం ఫీజ్ గుర్రపు స్వారీ పై పట్టు సాధించాలనుకునే వారికి మరొక రకం ఫీజ్ అందుబాటులో ఉంటుంది. గుర్రపుస్వారీ రంగంలో రాణించాలనుకునే వారికి ఆరు నెలల ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉంటాయి. అయితే దేశీ విదేశీ జాతి గుర్రాలపై అనుభవజ్ఞులు శిక్షణ ఇస్తారట. ఇక అటు కోర్సులు నేర్చుకునేందుకు ఫీజు అందరికీ అందుబాటులోనే ఉన్నాయని తెలుస్తోంది. ఏదేమైనా ఇక అందరికీ అందుబాటులో గుర్రపుస్వారీ శిక్షణ కేంద్రం ఏర్పడటంతో ఎంతోమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.