మార్నింగ్ రాగా : ఉన్నన్నాళ్లూ.. ఒకింత విస్తృతి
లేదా ఆ ఉప్పుటేరు గాలికో విన్నపం చేయాలి
ప్రేమకు నీ పేరు పెట్టుకుని తిరిగిన ఈ గాలులన్నీ
ఇప్పుడో ఎప్పుడో ఇవ్వడం మానుకుని ఎక్కడో ఆగిపోయాయి
ఆగడం వాగడం తూలడం అన్నీ తిరోగామి చర్యలే.. ఇవన్నీ నేను చీకటి నుంచి నేర్చుకున్నవి/విసుగ్గా అయినా చీరాగ్గా అయినా ఏం అయినా కాకున్నా ఇవన్నీ తృణప్రాయాలే.. ఎవ్వరో ఒకరు పాఠం నేర్పేరు..
వేర్వేరుగా ఉన్నవి..వేరు పడిన చీకటి
విశాలం అయిన మాట విస్తృతికి తూగని మాట
ఇవన్నీ చైతన్యం నుంచి చీకటిలోకి పోయాయి
అందుకే ప్రాణం స్వరాలకు కూడిక..ను నేర్పుతోంది
అలాంటి ప్రాణ స్వర ఛాయాలలో అంతా మేం అంతా ఇంకా ఏదో వెతుక్కుని తీరుతున్నాం/మీ సంకల్పం నెరవేరింది కదా! హా సర్ ..మా ఊరి ఎంపీ రామూ అడుగుతున్నారు ఇలా.. నా కన్నా నన్ను అడుగుతోంది ఇలా..తను రైల్లో ప్రయాణిస్తూ.. అమ్మవారిని ఉపాసిస్తూ..మేలు కోరుకుంటూ ..తనదైన దారిలో ఈ జగతికి వెలుగు అందించే వేళలు..ఎన్ని ఉన్నాయో వెతుకుతూ పోతూ..నాలాంటి నన్ను ఒకరిని ప్రేమిస్తోంది..కన్నా లవ్యూ..ఎవ్వరయినా ఎవ్వరి నుంచి అయినాఇంకొంత అర్థించాలి.. పాట నుంచి మాటనుంచి నడకలేవో స్వర సంబంధితాలుగా మిగలకమునుపు ఆ మౌనం ఏంటో..ఎవరికి వారే అవగతం చేసుకుంటే మేలు..పాటల్లో ఏమీ లేదు చైతన్యం ఇవ్వడం లేకుండా పోవడం..గొంతుకల్లో ఏమీ లేదు అవన్నీ ఆధారితాలు నేపథ్య భూమికలు నిర్ణయాత్మకాలు.. ఆత్మికం అన్నది ఔదార్యం కాదు సౌందర్యం కావొచ్చు
లేదా ఆ ఔదార్యం అన్నదే ఓ సౌందర్య సంబంధ అవశేషం కావొచ్చు విశేషంలా వినిపించనూ వచ్చు/అవును! ప్రేమ ఆత్మికానికి పరాకాష్ట.. అది వెల్లడిలో వెలుగులో ఉన్నవి లేదని లేనిది ఉందని భ్రమకు /సంకేతిక.. జస్ట్ స్టాప్ దట్ .. ఇలాంటి చోట.. ఒక కుహూరుత కూడిక ఆ అరుపే చరుపే మన జీవితాలకో విభ్రమ/ఆ సంజె కాంతుల స్వాప్నిక మాయ.. ఎలాంటిదో అలాంటిది.. ఒకనాటిది.. వేరు నుంచి వేరు పడ్డ వాటి నుంచి/జనితం కానిది అయితే కావొచ్చు..లేదా పరంపరగానూ ఉండొచ్చు.. ఇప్పటికీ ఓ విభేదం ఇప్పటి నుంచి విశ్లేషణఎందాక ఉంటే అంత మేలు..
ఉన్నాన్నళ్లూ
వేడుక నుంచి
ఉన్నన్నాళ్లూ
విరిగిన మట్టి పెళ్లల పెళుసుదనం నుంచి
లేనన్నాళ్లూ సమాధి స్థితినుంచి సంచయానికి సందిగ్ధానికీ మధ్య
అవకలన రూపం ప్రతిక్షేపణ గుణకం శిథిలంలో కరిగాక కరగని కాలంలో
ఇప్పుడిక ఆ ఊపిరి అవశేషం .. విత్తును ఉంచి విపత్తును అందించి పోయిందని పోతోందని అనుకోవడం ఓ విశేష సంబంధం..అనుకోకుండా ఉండడమే వివర్తన సంబంధం- ఆ కాంతి గోడలను తన్నుకుని దహించుకునే గుణాలను దహించేలా చేస్తూ పోతూ గీతూ- ఇలానే ఎలానో విభ్రమ అనిపించేలా దేహాల్లో కూడుకుని నాటుకుని పోయిందో వేళ లేదా వేదన - అందుకే.. ఇలాంటి పర్వం అలాంటి స్వరం ఒకటి కూడిక ఒకటి తెర వెనుక తెర - అలాంటిదో ఇలాంటిదో ఏదయినా ఏనాటిదో ఊహకు అందినంత స్పృహకు చిక్కినంత - ఉందో లేదో..ఉంటే గింటే అయితే గియితే మేలు .. మేలు కాని మేలు..
- రత్నకిశోర్ శంభుమహంతి
ఆర్ట్ : లక్ష్మణ్ ఏలే