షాకింగ్‌ వీడియో: ఆయన పక్కలో చంటి బిడ్డల్లా పులులు..?

చిరుత పులులు.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే జంతువు.. దీని కంట ఏదైనా ఆహారం పడిందంటే.. దాని ఆయువు మూడినట్టే.. ఈ చిరుతకు కడుపు నిండి ఉంటేనే.. దాని కంట పడిన జంతువుకు ఇంకా ఆయువు ఉన్నట్టు.. అంతే.. ఈ చిరుత ఆకలితో ఉందా.. ఇక దాని కంట ఏ జంతువు పడినా.. వెంటాడి వేటాడి మరీ చంపి తింటుంది. మరి అలాంటి చిరుత పులి అడవిలో ఎవరైనా మనిషికి కనిపిస్తే.. ఎలా ఉంటుంది. పై ప్రాణాలు పైనే పోతాయి కదా.

కానీ.. ఓ వ్యక్తి మాత్రం అడవిలో అర్థరాత్రి చక్కగా పులులు కుటుంబంతోనే నిద్రపోతున్నాడు. అంతే కాదు.. ఆ చిరుత పులి కుటుంబం కూడా ఆయనతో అప్యాయంగా సొంత కుటుంబ సభ్యుడిగా ప్రేమ కురిపిస్తున్నాయి. అలా నిద్రపోతున్న సమయంలో ఓ చిరుత పులికి మెలకువ వచ్చింది.. చుట్టూ చూస్తే.. ఆయన లేడు.. అంతే అసహనంగా కదిలింది. ఊహూ.. నేనిక్కడ పడుకోను.. నీ పక్కలోనే పడుకుంటా అని మారాం చేసినట్టు అతని వద్దకు వెళ్లింది.

అతడు.. ఆప్యాయంగా చేయిచాచి.. ఆ చిరుతను అక్కున చేర్చుకున్నాడు.. రా నాన్నా.. రా బుజ్జి కన్నా అన్నట్టుగా ఆప్యాయంగా దాని తలపై నిమురుతూ నిద్ర పుచ్చాడు.. అది చూసి కుళ్లుకున్న మిగిలిన చిరుత పులులు కూడా తామూ నీ దగ్గరే పడుకుంటామంటూ మారాం చేశాయి. అతని చుట్టూ ఉన్న జాగాలోనే ఇరుక్కుని ఇరుక్కుని మరీ పడుకున్నాయి. ఈ వీడియో చూస్తే.. ఏమాత్రం నమ్మశక్యంగా లేకున్నా.. భలే ముచ్చటగానూ అనిపిస్తుంది.

అసలు ఇంతకీ ఈ వీడియో ఎక్కడిది.. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు.. ఇదంతా నిజమేనా.. ఏమైనా గ్రాఫిక్ మాయాజాలమా.. అన్న సందేహాలు వస్తున్నాయి కదూ. అయితే ఆ సందేహాలు మాత్రం తీర్చలేం.. ఎందుకంటే.. ఈ వీడియోను ఐఆర్‌ కుమార్‌ అనే సాకర్ ప్లేయర్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు. ఓ ఫారెస్టు గార్డుతో ఓ చిరుత కుటుంబం అన్యోన్యత చూశారా అంటూ వీడియో పోస్టు చేశారు. అయితే ఇదంతా ఎక్కడ జరిగింది.. అతనెవరు అన్న విషయాలు మాత్రం అటవీశాఖే కనుక్కోవాలని కోరాడు. నిజానికి అతడెవరో కానీ.. ఇది ఓ ఎమేజింగ్ వీడియో అని ఒప్పుకోక తప్పదు. కావాలంటే మీరూ చూడండి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: