ఫెస్టివ్ మూడ్ : పండ‌గ మ‌రియు పేకాట అయిపోయాయా?

RATNA KISHORE
సంక్రాంతి పండుగ అంటేనే ముందు వ‌రుస‌లో నిలిచేవి పందేలు మ‌రియు పేకాటలు.కోడి పందేలు ఆప‌డం మావ‌ల్ల సాధ్యంకాద‌ని ఎప్పుడో పోలీసులు చేతులెత్తేశారు.ఆ విధంగా 300 కోట్లు క‌ళ్ల‌ముంద‌రే చేతులు మారిపోయాయి.ఇక తాగుడు లెక్క ఎంతుందో ఇంకా తేల‌లేదు.మొన్న న్యూ ఇయ‌ర్ కు ఏపీలో 120 కోట్లు (ఒక్క రోజు వివ‌రం) తాగేశారు.. ఆ లెక్క‌న ఓ ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌లు అయినా రావాలి..వ‌చ్చే ఉంటుంది.కానీ రాదు ఎందుకంటే ప‌ల్లెల‌లో ప్ర‌భుత్వం అమ్మే నాన్ బ్రాండ్ స‌ర‌కు క‌న్నా నాటు సారా చాలా సులువుగా ఈ సారి దొరికేసింది.


శ్రీ‌కాకుళంకు స‌రిహ‌ద్దుగా నిలిచే ఒడిశా నుంచి హాయిగా ఎటువంటి అడ్డూ అదుపూ లేకుండానే నాటుసారా వ‌చ్చేసింది.ఇంకేం ఫూటుగా తాగి చిందేశారు మందుబాబులు.ఆవిధంగా ప్ర‌భుత్వం అన్ బ్రాండ్ స‌రుకు ఉండిపోయింది. కానీ కొంత‌లో కొంత మ‌ద్యం అమ్మ‌కాలు బాగానే సాగాయ‌ని టాక్. ఇవి కాకుండా కాయ్ రాజా కాయ్ పందాలు ఉండే ఉంటాయి క‌దా! మ‌రి!వాటి సంగ‌తో! ఏ విధంగా చూసుకున్నా పండుగ షాపింగ్ ఓ వెయ్యి కోట్లు, తాగుడు తంద‌నాలు క‌లిసి మ‌రో వెయ్యి కోట్లు..అన‌గా రెండు వేల కోట్ల రూపాయ‌లు ఈ సంక్రాంతికి వెచ్చించార‌ని ఓ అంచనా వేసుకుందాం ప్ర‌స్తుతానికి..!


ఏమో ఈ లెక్క మారినా మారవ‌చ్చు.లేదా అస‌లు లెక్క తేలేలోపే షాపింగ్ మాళ్లు త‌మ లెక్క‌ల‌న్నీ మార్చి రాయించ‌నూవ‌చ్చు. క‌నుక పండ‌గ వెళ్లిపోయింది క‌నుక పేక ద‌స్తాలు స‌ర్దేయండి. కోడి పందేలు వీలున్నంత మేర ఆపేయ్యండి.ఇంకా నాటు సారా తాగుడు కూడా ఆపేయ్యండి. ఇంకా కాయ్ రాజా కాయ్ అంటూ ఇక ఎగ‌ర‌మాకండి,దూక‌మాకండి. ఇక పందేల్లో స‌ర్వం కోల్పోయినోళ్లు నిబ్బ‌రం కోల్పోకండి..అలా అని కొత్త నిబ్ ఒక‌టి కొనుక్కుని ఆరోగ్యం పాడుచేసుకోకండి. హాయిగా వ‌చ్చే పండ‌గ కోసం ఇప్ప‌టి నుంచే జాగ్ర‌త్త ప‌డ‌డం నేర్చుకోండి..నాలుగు రూపాయ‌లు దాచుకునే ప‌ద్ధ‌తి ఒక‌టి త‌ప్ప‌క ఎంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: