లైఫ్ స్టైల్: ఎలాంటి రైస్ తింటే లాభమో తెలుసా..?

Divya
సాధారణంగా భారతదేశంలో ప్రధానంగా పండించే పంట వరి. అందుకే చాలామంది ఎన్ని తిన్నా సరే అన్నం తినడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. అయితే కొంతమంది అన్నం తినడానికి ఇష్టపడకపోగా.. రోటి తినడానికి ఎక్కువ మక్కువ చూపుతూ ఉంటారు. అయితే అన్నం లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువే. చలికాలంలో రైస్ ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఏడాది పొడవునా అన్నం తింటూనే ఉంటాం కాబట్టి దీని ప్రభావం మన ఆరోగ్యంపై పడే అవకాశం కూడా ఉంటుంది.. చాలామంది వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ తినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

చాలామంది అన్నం తినాలి కానీ బరువు పెరగకూడదు అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే అలాంటి వారికి బ్రౌన్ రైస్ సరైన బెస్ట్ ఆప్షన్ అని వైద్యులు చెబుతున్నారు. మరి బ్రౌన్ రైస్ కి.. వైట్ రైస్ కి మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం..

వైట్ రైస్:
మన భారతదేశంలో అధికంగా పండించే పంట తో పాటు అధికంగా తినే రైస్ కూడా ఇదే కావడం గమనార్హం. ఈ రైస్ ను బాగా రిఫైన్డ్ చేసి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. ఇలా రిఫైన్డ్ చేయడం వల్ల ఇందులో ఉన్న పోషకాలు కూడా కోల్పోయి తక్కువ పోషకాలు మాత్రమే లభిస్తాయి. కానీ శక్తి మాత్రం సమానంగా ఉంటుంది. ఈ వైట్ రైస్ లో ఉండే పిండి పదార్థం వల్ల ఈ రైస్ మిగతా వాటితో పోల్చుకుంటే ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది.

బ్రౌన్ రైస్:
ఇది మనకు ఎలా దొరుకుతుంది అంటే రిఫైండ్ ప్రాసెస్ జరగని రైస్ ని మనం బ్రౌన్ రైస్ అని అంటాము. ఇక ప్రయోజనాల విషయానికి వస్తే వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ లోని ఎక్కువ పోషకాలు అలాగే ఆరోగ్యం కూడా. కాబట్టి చాలామంది బ్రౌన్ రైస్ తినడానికి ఆసక్తి చూపుతున్నారు.
తాజాగా జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ప్రతి రోజూ ఒక కప్పు బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం 60 శాతం తగ్గుతుందట..ఇలా  తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవడంతో పాటు న్యూట్రీషియన్స్ కూడా మనకు ఎక్కువగానే లభిస్తాయి. ఇక గుండె ఆరోగ్యంగా ఉండడంతోపాటు క్యాన్సర్ వంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: