కరోనా తర్వాత మీరు ఇలా మారారా.. లేదా..?


జీవితం దేవుడు ఇచ్చిన అద్భుత వరం.. మనం మన రొటీన్ లైఫ్‌లో పడిపోయి దీని విలువను చాలా తక్కువ చేస్తాం.. ఆనందించే మార్గాలు తెలియక ఆవేదనలో చిక్కుకుంటాం. మనకు ఉన్న ప్లస్ పాయింట్స్‌ గుర్తించక లేని దాని గురించి అర్రులు చాస్తాం.. అయితే.. కరోనా తర్వాత చాలా మంది జీవితాలు మారిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. కరోనా మన జీవితాలను మార్చేసింది. అయితే.. కరోనా కొన్ని మంచి విషయాలు కూడా నేర్పింది.

ఈ జీవితం శాశ్వతం కాదు.. ఏ క్షణంలోనైనా ప్రాణం పోవచ్చు.. జీవితం గాలి బుడగ వంటిది.. వంటి  సూత్రాలు సాధువులు, బాబాలు ఇన్నాళ్లు చెప్పినా మన చెవికి ఎక్కలేదు.. కానీ.. కరోనాతో ఈ బోధనల సారమంతా మనకు అనుభవంలోకి వచ్చేసింది. ఇదేదో క్యాజువల్ గా చెబుతున్న విషయం కాదు.. డెలాయిట్ వంటి సంస్థ నిర్వహించిన సర్వేలో కరోనా భారతీయుల జీవితాలను మార్చేసిందని తేలింది.

కరోనా భారతీయుల జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చిందో ఈ డెలాయిట్ సర్వే చెప్పింది. కరోనా తర్వాత జనం భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకుంటున్నారట. ఇది మంచి అలవాటే.. అదే సమయంలో జనం తమ అభిరుచులు, వస్తువుల కోసం ఖర్చు చేయడంలో మాత్రం వెనక్కు తగ్గడం లేదట. కరోనా తర్వాత 74 శాతం మంది జనం ద్రవ్యోల్బణం గురించి కంగారు పడుతున్నారట. అలాగే 85 శాతం మంది వచ్చే నెల రోజుల్లో ఏం చేయాలో ఇప్పుడే ప్లాన్ చేసుకుంటున్నారట.

మరి వీళ్లంతా జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో తెలుసా... 68 శాతం మంది రెస్టారెంట్లకు వెళ్లాలనుకుంటున్నారట. అవి సేఫ్టీ అని భావిస్తున్నారట. మరో 74 శాతం మంది త్వరలో కొత్త వాహనం కొనాలనుకుంటున్నారట. 65 శాతం మందికి విమాన ప్రయాణం అంటే ఇష్టమట. తమ కోరిక నెరవేర్చుకుందామనుకుంటున్నారు. ఇలా చాలా మంది తమ చిన్న చిన్న కోరికలను ఆలస్యం చేయకుండా నెరవేర్చుకుంటున్నారట. మరి మీరేం ప్లాన్ చేస్తున్నారు..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: