"తెగే దాకా లాగితే"... బంధాలైనా తెగక మానవు ?
అపుడే వారి దాంపత్యం మరింత బలపడుతుంది..అలాగే వారి కుటుంబం కూడా పదిలంగా ఉంటుంది. అలా కాకుండా నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఒకరి తప్పులను మరొకరు ఎత్తి చూపుతూ...ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా కయ్యానికి కాలు దువ్వితే చివరికి వారి మధ్య సంతోషం కరువవుతుంది వారి బంధం భారమవుతుంది. తెగే వరకు లాగితే దారమే కాదు బంధమైనా సరే తెగక మానదు. ఇద్దరిలో ఒకరైన సర్దుకుపోవాలి, ఎక్కడో ఒకచోట తగ్గి వారి బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే అప్పటి వరకు ఒకటిగా ఉన్న వారి జీవితం రెండుగా విడిపోతుంది..నిజమైన సంతోషం ఆవిరవుతుంది.
డబ్బు, స్టేటస్ లు విలాసవంతమైన జీవితాన్ని , సౌకర్యవంతమైన జీవితాన్ని ఇస్తాయేమో, కానీ బంధాలు అసలైన సంతోషాలను మనకి ఇస్తాయి. ఆ బంధాలను చివరివరకూ నిలుపుకోవడమే అసలైన విజయం అన్నారు పెద్దలు. విషయం ఏదైనా కలసి ఎదుర్కోవాలి, సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలి. అంతే కానీ సమస్యను మీ మాటలతో చేతలతో మరింత క్లిష్టతరం చేసుకుని సరిదిద్దుకో లేని సమస్యలు కొని తెచ్చుకోకూడదు. అవి మీ జీవితంలో సంతోషాలను పూర్తిగా లాక్కునే అవకాసం ఉంది.