లైఫ్ స్టైల్: ఈ చిట్కాతో మీ షాపింగ్ లో డబ్బు ఆదా అవ్వడం ఖాయం..!
ఇకపోతే మీరు షాపింగ్ కి వెళ్లే ముందే మీకు ఏ వస్తువు కావాలో లిస్ట్ రెడీ చేసి పెట్టుకోండి.. ఆఫర్ ఉన్న ప్రతి వస్తువు పైకి మన కన్ను వెళ్ళడం సహజం.. కానీ మీ లిస్టు లో ఉన్న వస్తువులు మాత్రమే కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయండి.. ఇలా చేయడం వల్ల సమయంతో పాటు డబ్బు కూడా కొంచెం అవుతుంది. వివిధ కంపెనీలు కూడా కస్టమర్లను బాగా ఆకట్టుకోవడానికి ఎన్నో ఆఫర్లను ఇస్తూనే ఉంటాయి.. ఆఫర్లు ఇచ్చినప్పుడు మనం బిల్లు గురించి ఆలోచించకుండా ఏది పడితే అది కొనేస్తే మాత్రం డబ్బు లూటీ అవడం జరుగుతుంది.
అనవసర వస్తువులను కొనుగోలు చేయకుండా దూరంగా ఉండడమే మంచిది.. మీరు కొనుగోలు చేసే వస్తువు ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో ముందుగా ఒకసారి వెతకడం మంచిది. ఇక ఏదైనా వస్తువులను కొనేటప్పుడు ఆ వస్తువు ఎప్పుడు తయారు చేశారు.. ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అనే విషయాన్ని కూడా చూసుకోవాలి.. అయితే ఆఫర్లను సంవత్సరం పొడవునా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి కాబట్టి అవకాశం రాదేమో అని ఆందోళన చెందకుండా కచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని, మీకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల తప్పకుండా డబ్బు ఆదా అవుతుంది.