జాగ్రత్త: 35 సంవత్సరాల లోపు వారికే గుండె జబ్బుల బెడద...

VAMSI
గుండె జబ్బుల వ్యాప్తి ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేది. వయసు మీరిన వారికి మాత్రమే వచ్చేవి. తద్వారా ఎవ్వరికీ పెద్దగా తెలిసిదే కూడా కాదు. అయితే ప్రస్తుతం ఉన్న జెనరేషన్ లో దాదాపుగా ఎక్కడ ఎవ్వరు చనిపోయినా హార్ట్ ఎటాక్ కారణమని తెలుస్తోంది. అందులోనూ వారి వయసు కూడా పెద్ద వయసు కాకపోవడం షాకింగ్ అని చెప్పాలి. కేవలం అతి తక్కువ వయసున్న వారు, ఇప్పుడిప్పుడే ఎన్నో ఆశలతో జీవితాన్ని స్టార్ట్ చేస్తున్న వారిని కూడా హార్ట్ ఎటాక్ కబళిస్తోంది. ఎప్పుడో 60 సంవత్సరాల పైబడిన తర్వాత వచ్చే జబ్బులన్నీ చిన్నవయసులోనే వచ్చేస్తున్నాయి. ఇది ఇప్పటి యువతరాన్ని కంగారు పెడుతోందని చెప్పవచ్చు. ఇటీవల జరిపిన కొన్ని సర్వేలలో గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు తెలిశాయి.
కేవలం భారతదేశంలో గుండె పోటుతో చనిపోతున్న వారిలో ఎక్కువ మంది 30 సంవత్సరాల నుండి 50సంవత్సరాలలోపు వారేనని ఒక సర్వే తెలిపింది. రెండు రోజుల క్రితమే ప్రముఖ టీవీ నటుడు సిద్దార్ధ్ శుక్ల గుండెపోటు తో మరణించాడు. కానీ అతని వయసు 40 సంవత్సరాలే కావడం యువకులను కలవరానికి గురిచేస్తోంది. ఎందుకు యువకులు ఇంత చిన్నవయసులోనే గుండె పోటుతో చనిపోతున్నారు అనే విషయం ఇప్పుడు దేశమంతా హాట్ టాపిక్ గా మారింది. కొత్తగా అలవాటు చేసుకుటనున్న లైఫ్ స్టైల్ ప్రధాన కారణమని డాక్టర్స్ చెబుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఇప్పుడున్న యువతలో ఎన్నో చెడు అలవాట్లు వారి జీవితాన్ని హరించేస్తున్నాయి. వీటిలో ధూమపానం, అధిక ఒత్తిడి, అధిక శ్రమ వుండకపోవడమే కారణాలని తెలుస్తోంది.
ఈ అలవాట్లు ఉన్న వారిలో చాలా త్వరగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు డాక్టర్స్ చెబుతున్నారు. నేటి సమాజంలో యువత ఎక్కువగా సిగరెట్లు మరియు ఆల్కహాల్ తాగడం ఒక ఎంజాయ్ మెంట్ మరియు స్టైల్ లాగా తీసుకుంటున్నారు. అందుకే చాలా మంది యువత వారికి తెలీయకుండానే బానిసలైపోతున్నారు. సిగరెట్లలో ఉండే కార్బన్ మోనాక్సయిడ్ మన రక్తంలోని ఆక్సిజన్ శాతాన్ని తగ్గిస్తుంది. ఈ అలవాట్లు ఉన్న వారి గుండె చాలా వీక్ గా అయిపోతుంది. అంతే కాకుండా  మన శరీరం లోని ముఖ్యమైన భాగాలన్నీ పాడయిపోతాయి. కాబట్టి మీరు ఇప్పటి నుండే ఎంతో జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అందుకోసం మీకున్న చెడు అలవాట్లను తగ్గించుకోండి. పని భారం కారణంగా మీపై పడే అధిక ఒత్తిడిని తగ్గించుకోండి.

అప్పుడప్పుడూ రిలాక్స్ అవుతూ ఉండండి. రోజూ ఏదొక వ్యాయామం చేయండి. బయట ఎటువంటి ఫుడ్ ను తినకండి. అప్పుడప్పుడూ మీ శరీర బరువును చెక్ చేసుకుంటూ ఉండండి. మీ వయసుకు తగిన బరువు లేకుంటే ప్రమాదమే అని గుర్తించండి. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బుల నుండి బాయటపడగలమని డాక్టర్స్ సలహాలు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: