ఈ శుక్రవారం : శ్రావణాన సడి చేసిన వాన
పొంగిపోవడం ఇప్పటి ఆనందం
వాన లేదనుకుని బాధపడడం
ఇప్పటి సమీప విషాదం
ఏ గ్రేట్ సేరోయిస్ట్ థింగ్ ఫర్ మి
మరి! వాన కు వేళ ను నేర్పని
రుతువులు ఎన్ని ఉన్నాయో
ఈ రోజు మా ఊళ్లో వాన కాస్త పలకరింపు
మరి కాస్త ఊరడింపు ఈ రోజు మా ఊళ్లో వాన
శ్రావణాన కాస్త హాయి మరికాస్త ఉత్సాహం కూడా!
వాన సందళ్లు వినడం..చూడడం అస్సలు సాధ్యం కాని పనిలా మారిపోయింది ఈ వేళ..వేళకు ఎండలు ఎన్ని ఉన్నా వేళ కాని వేళ వాన వస్తే కూడా మనకు ఆనందమే.. కా నీ వేళను పాటించని వాన కన్నా..వేళను అనుసరించే వానే గొప్పది కదా! ఈ శుక్రవారం ఈ శుభ శ్రావణ శుక్రవారం తల్లులంతా కుంకుమ పూజల్లో ఉంటే, వాన దేవర పలక రింపు కాస్త ఊరట. ఎండలకు వీడ్కోలు చెప్పే కాలం వెళ్లి ఎంత కాలం అయిందో కానీ అదే పనిగా మారిన వాతావరణ స్థితిగతుల్లో వానలు రాక పంటలు లేక కన్నీరెడుతు న్న రైతుల గోడు ఇప్పటికైనా పట్టించుకుంటుందా ఆ ఆకాశం. తీవ్ర ఉక్కపోతల నుంచి సమీప సుదీర్ఘ వేసవి కాలాల నుంచి మనకు కా స్తయినా మినహాయింపు ఇస్తుందా మరి! ఏమో! వేడుకోవడం బాధ్యత.. ఆశల వానలు కొన్ని వస్తే చాలు..బాధలు ఒడ్డెక్కిపోతా యి.. రెండు పంటల కాలం సకాలంలో చేతికి చేరితే అప్పులు తీరిపోతాయి.
గాలీ వానల సయ్యాటను వినడంలో ఆనందం ఉంది..శ్రావణాన అమ్మవారి ఆరాధన లో జీవితాన్ని అర్థవంతం చేయడంలోనూ ఆ నందం ఉంది. ఇంతకూ ఈ వానలన్నీ ఎటు పోయాయి.. నేల తాపాన్ని చల్లార్చే వానలు లేకపోవడం మనుషులు చేసుకున్న దురదృష్టం కాక ఇంకేంటి?అయినా వాన జడి...సడి.. చినుకు నాట్యం అన్నీ వినడంలో ఎంత గొప్ప ప్రశాంతత. కానీ మనం ఈ ప్ర శాంతతలను పొందడం ఇప్పటికిప్పుడు సాధ్యం చేసుకోవడం లేదు.. పచ్చని లోగిళ్లు లేని కారణంగా..వానల్లేవు అని తేల్చారు
పర్యావరణ వేత్తలు. మరి! ఈ శ్రావణం అయినా ఓ కొత్త ఆరంభానికో శ్రీకారం దిద్దితే నాలుగు మొక్కల పెంపకం ఎవరి ఇంటో మొదలయితే వానలు వస్తాయి..పిల్లలకూ,పె ద్దలకూ కాసిన్ని నవ్వులు ఇస్తాయి..కథలు చెప్పి..రాత్రిళ్లు గొప్పనైన జ్ఞాపకం అవు తాయి.. వానంటే ఇష్టం సర్ .. కానీ అదెంత దూరంలో ఉందో అన్నది విచారకరం.