బిర్యానీ ఆకులతో ఆ సమస్యలకు చెక్..

Satvika
బిర్యానీ ఆకులను ఎప్పుడూ చూస్తుంటారు.. ఎందుకంటే అంతగా ఆ ఆకులు వాడుకలో ఉన్నాయి.. సువాసనలు వెదజల్లే ఈ ఆకులను ఉపయోగించి మంచి ఆహారపదార్థాలను తయారు చేసుకొవచ్చు. అందుకే వీటికి మన దేశంలో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. కేవలం ఆహారంలో మాత్రమే కాదు.. ఆరోగ్యం లో కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.. వీటిని ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్యం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం...


శ్వాసకోశ వ్యవస్థ ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమయ్యే ఇంటర్‌ల్యూకిన్‌ అనే ప్రొటీన్‌ను వ్యాధినిరోధక వ్యవస్థ స్వల్ప పరిమాణాల్లో విడుదల చేస్తూ ఉంటుంది. తరచు ఈ ఆకులను తీసుకుంటే మంచిగా పోషకాలు అందుతాయని నిపుణులు అంటున్నారు.. 


ఇకపొతే ఈ మధ్య జనాలకు గ్యాస్, అల్సర్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు..చెడు కొలెస్ట్రాల్‌, చక్కెరలను తగ్గించి శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ తయారయ్యేలా ఈ ఆకులు సహాయ పడతాయి..

మమధుమేహం నియంత్రణకు ఉపయోగపడుతుంది. మధుమేహుల్లో రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణతో పాటుగా గుండె పని తీరును మెరుగుపరచడానికి ఈ ఆకు చక్కగా ఉపయోగపడుతుంది.. వంట లలో ఎక్కువగా ఈ ఆకులను వాడటం వల్ల ఎన్నో రకాల క్యాన్సర్లను నియంత్రిస్తుంది.

ఇప్పుడు ముఖ్యంగా వినిపించే పేరు నిద్ర లేమి.. ఈ బిర్యానీ ఆకులను గ్లాస్ నీళ్ళల్లొ కలుపుకొని సేవిస్తే ఆ సమస్య దూరం అవుతుంది.మరిగించిన నీళ్లు తాగడం వల్ల రాళ్లు ఏర్పడడం, ఇతర కిడ్నీ సంబంధ వ్యాధులు రావు.. ఒత్తిడి ని దూరం చేయడం లో ఈ ఆకు దివ్య ఔషదం అనే చెప్పాలి..ఎండిన బిరియానీ ఆకును కాల్చి, వాసన పీల్చాలి. గది తలుపులు మూసి, ఓ గిన్నెలో బిరియానీ ఆకును కాల్చాలి. అప్పుడు వచ్చే వాసన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.. చుసారుగా ఈ ఆకులు బిర్యానీ కి మాత్రమే ఆరోగ్యానికి కూడా ఎంత మేలు చెస్తాయో.. ఇప్పటి నుంచి మీరు కూడా ఈ ఆకులను ఉపయోగించి ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: