వీటిని పొరపాటున కూడా అస్సలు తినకండి.. ఎందుకంటే?

Satvika
ప్రస్తుతం కరోనా కోరలు చాచుతుంది.. కళ్లు మూసుకొని పడుకోవాలన్నా కూడా భయంతో జనాలు వణికిపోతున్నారు. కడుపు నిండా తినాలని కూడా ఉండదు. దాంతో ఇమ్యునిటి కూడా తగ్గిపోతుంది.సెకండ్‌ వేవ్‌ కరోనా వైరస్‌ చాలా ప్రమాదకరమైందని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు ఎక్సర్‌సైజ్, ఆరోగ్యంతో పాటు శక్తినిచ్చే ఆహారం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్‌ పెరుగుతుంది. కానీ, మనం తీసుకుంటున్న కొన్ని ఆహార పదార్థాలతో మన శరీర వ్యాధి నిరోధర శక్తిని తగ్గిపోతుంది.
వివిధ పరిశోధనలు జరిపిన తర్వాత ఇమ్యూనిటీ పవర్‌ కోల్పోవడానికి ఈ ఆహార పదార్థలు చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని తేల్చి చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆరు రకాల ఆహారపదార్థాలను అస్సలు తీసుకోకుండా ఉండటమే బెస్ట్ అట.. అవేంటో ఒకసారి చూద్దాం..

ఫాస్ట్‌ఫుడ్‌
ఫాస్ట్‌ఫుడ్‌కు కూడా దూరంగా ఉండాలి. ఫాస్ట్‌ఫుడ్‌ వల్ల శరీరంలో చక్కెర, సోడియం, సాచురేటడ్‌ ఫ్యాట్‌ వల్ల మీ ఇమ్యూనిటీ పవర్‌ తగ్గిపోతుంది. వీటిలో ఫైబర్‌ ఉండదు కావునా, ఇది మీ ఇమ్యూనిటీ పవర్‌ను మెల్లగా తగ్గించేస్తుంది.
సొడా
సొడాలో ఎక్కువ శాతం షుగర్‌ కేలరీస్‌ ఉంటాయి. దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పూర్తిగా తగ్గించేస్తుంది. వీటిలో ఎటువంటి న్యూట్రాన్స్‌ కూడా ఉండవు. దీనివల్ల బరువు కూడా పెరుగుతారు. దీనికి బదులుగా దానిమ్మ రసాన్ని తీసుకోవచ్చు. వాటిలో ఎటువంటి చక్కెర కలపరు కాబట్టి, శరీరానికి చాలా మేలు చేస్తుంది..

చిప్స్‌
ఆలుగడ్డతో తయారు చేసిన చిప్స్‌ వల్ల ఇమ్యూనిటీ పవర్‌ దారుణంగా పడిపోతుంది. వీటిలో ఎటువంటి న్యూట్రిషన్‌ ఉండదు. ఎక్కువ శాతం వీటిని తినకపోవడమే మేలు. దీనికి బదులుగా అరటి పండ్లు, బ్లాక్‌ బీన్స్, ఖర్జురం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్‌ పెరుగుతుంది..
చక్కెర పదార్థలు
నేచురల్‌గా తియ్యదననిచ్చే తేనె, బెల్లం వంటివి శరీరానికి మంచివి. కానీ, చెక్కెర కలిపిన పదార్థాలు మీ శరీర ఇమ్యూనిటీ పవర్‌ను తగ్గించేస్తుంది. షుగర్‌ క్యాండీస్, చక్కెర కలిపిన జ్యూస్‌లు, తినుబంఢారాలు, కేక్‌లు వంటి చక్కెర కలిపిన పదార్థాల వల్ల విపరీతమైన హాని కలుగుతుంది.

సోడియం ఆధారిత ఫుడ్‌
క్యాన్డ్‌ ఫుడ్, ఫ్రోజెన్‌ మీట్, వెజిటేబుల్స్, పిజ్జా, స్నాక్స్‌ మన శరీరానికి అస్సలు మంచివి కావు. సోడియం ఆధారిత ఫుడ్‌ తీసుకోవడం వల్ల బీపీ లెవల్స్‌ పెరిగిపోతుంది. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్

ఎక్కువ శాతం క్రీం, తీపితో కూడిన ఐస్‌క్రీంలో సాచురేటడ్‌ ఫ్యాట్‌ ఉండటం వల్ల ఇమ్యూనిటీ పవర్‌ తగ్గిపోతుంది. అంతగా మీకు తినాలనిపిప్తే, బయట చేసిన ఐస్‌క్రీంలు కొనడం కంటే నేచురల్‌ పద్ధతిలో ఇంట్లోనే ఐస్‌క్రీం తయారు చేసుకోవడం మంచిది..ఇందులో వివిధ రకాల నట్స్ వేసుకొని తింటే చాలా మంచిది..
చూసారుగా ఈ పదార్థాలను తీసుకోవడం మంచిది కాదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: