రామాఫలం ఏడాదిలో ఒకసారి తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..!

Satvika
సీతాఫలం ఈ పేరు అందరికీ తెలుసు.. ఇది సీజనల్ ఫ్రూట్.. అయితే ఈ పండును ఏడాదికి ఒకసారి తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అలాగే రామాఫలం.. ఈ పండు అరుదుగా దొరుకుతుంది. అయితే, వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని న్యూట్రీషన్లు అంటున్నారు. ఆరోగ్యానికి ఈ పండు శ్రీరామరక్ష అని కొందరు నమ్ముతున్నారు.శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్‌, కొవ్వు, ప్రొటీన్‌, విటమిన్‌ బి1,బి2,బి3,బి5,బి6, విటమిన్‌ సి, క్యాల్షియం, ఐరన్‌, పొటాషియం, సోడియం ఇలా ఎన్నో పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి.

రామాఫలంలో తియ్యదనం తక్కువ. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును నిరభ్యంతరంగా తినొచ్చు. ఇందులోని పోషకాలు రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి కూడా.రామాఫలంలోని విటమిన్‌ బి కాంప్లెక్స్‌, విటమిన్‌ సి ముఖంపై మొటిమలను నివారిస్తాయి. శరీరం లోని ఫ్రీ ర్యాడికల్స్‌ను బయటకు పంపటంలో ఇది ఉత్తమంగా పనిచేస్తుంది. అంతేకాదు, ఈ పండుద్వారా లభించే మంచికొవ్వు చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. చర్మకాంతిని పెంచుతుంది.ఇందులోని పొటాషియం శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌ బ్యాలెన్సింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. కండరాల పెరుగుదలకు దోహదం చేస్తుంది.

మలబద్ధకాన్ని నివారిస్తుంది. అంతేకాదు, సహజ యాంటీ బయాటిక్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణం కలిగిన రామాఫలం విరేచనాలను నియంత్రిస్తుంది. ఇకపోతే న్యూమోనియా, టైఫాయిడ్‌ వంటి అనారోగ్యాలకూ ఔషధంగా పనిచేస్తుంది.ఇందులో కాల్షియం అధికంగా ఉంది. ఎముకల సమస్యలు రాకుండా కాపాడుతుంది. గుజ్జును హెయిర్‌ ప్యాక్‌లా వేసుకోవచ్చు. దీనివల్ల చుండ్రు సమస్య తొలగిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఈ పండులోని ఫైబర్‌ జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది. పేగులను శుభ్రం చేసి జీర్ణాశయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దురద తగ్గించడంలో, చర్మ సంరక్షణ లో, వార్ధక్య ఛాయలను నియంత్రించడంలో రామాఫలం దివ్య ఔషధంగా పనిచేస్తుంది.. చూసారుగా ఈ పండును ఒకసారి తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. మీకు ఈ పండు అందుబాటులో ఉంటే తప్పకుండా తీసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: