ఉద్యోగానికి అని వెళితే... కూతురిని ఇచ్చి పెళ్లి చేసింది..!
20 సంవత్సరాల వయసులో ఉన్న ఆ వ్యక్తి ప్రతి రోజు ఒక ఆటో కిరాయికి తీసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటో నడిపే వాడు. ఆటో అద్దె యజమానికి ఉన్న డబ్బులతో తను ఎంతో ఎంజాయ్ చేసేవాడు. ఈ విధంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి "రోజంతా ఆటో ఏం నడుపుతావు కానీ, నాకు తెలిసిన వాళ్లకు ఒక ఒక మొబైల్ క్యాంటీన్ ఉంది. ఆ ట్రక్ నడపడానికి డ్రైవర్ కావాలి. ప్రతిరోజు 4 నుంచి 9 వరకు ఉంటే రూ.300 ఇస్తారని చెప్పడంతో సరే అన్నాను.
మరుసటి రోజు వారి దగ్గరికి వెళ్లాను అక్కడ ఓ పెద్దావిడ టిఫిన్ చేస్తూ ఉంటే 18 ఏళ్ల వాళ్ళ కూతురు టిఫిన్స్ అమ్మడం. ఈ విధంగా వారిద్దరికీ సహాయం చేస్తూ రెండు సంవత్సరాల పాటు గడిపాను. ఈ క్రమంలోనే వారి వ్యాపారంతో పాటే మా ఇద్దరి మధ్య ప్రేమ కూడా పెరిగింది. ఈ క్రమంలోనే వాళ్ళ అమ్మ తన కూతురుని పెళ్లి చేసుకుంటావా.. అని అడిగారు. ఈ విధంగా వాళ్ళ అమ్మ అడగడంతో ఆరు నెలలలోపే మా పెళ్లి జరిగింది. జీవనాధారం కోసం ఎక్కడైతే మొబైల్ క్యాంటీన్ నడి పామో ప్రస్తుతం అక్కడే పెద్ద రెస్టారెంట్ ఓపెన్ చేసాము. ఇప్పుడు మా రెస్టారెంట్ కి మా పాప పేరు "అమృత"అని పెట్టాము. కానీ ఇవన్నీ చూడటానికి ప్రస్తుతం వారి అత్త వారి దగ్గర లేదు అంటూఆ వ్యక్తి తన జీవితంలో జరిగిన సంఘటనను తెలియజేశారు.