కరోనా ఓ అరగంట ఇలా చేస్తే.. కరోనా వచ్చినా ఇబ్బంది లేదు..!?
కరోనాకు ఇప్పటి వరకూ మందు కనిపెట్టలేదు. వ్యాక్సీన్ ఇప్పట్లో వచ్చేలా లేదు. మరి ఈలోగానే మనకు కరోనా రాదన్న గ్యారంటీ ఏమీ లేదు. మరి కరోనా వస్తే ఎలా బతికి బట్టకడతామా.. అన్న ఆందోళన చాలా మందిలో కనిపిస్తోంది.
దీనికి మనవద్ద ఉన్న ఒకే ఒక్క మార్గం రోగనిరోధకశక్తిని పెంచుకోవడం. అది మన చేతుల్లోనే ఉంది. అందులోనూ అసలు పైసా ఖర్చు చేయకుండా వ్యాధి నిరోధక శక్తి పెంచుకునే మార్గం ఉంది. అదే డీ విటమిన్ పెంచుకోవడం. మరి ఈ డి విటమిన్ ఎలా పెంచకోవాలి..? అందుకు మార్గం సూర్యరశ్మి శరీరాన్ని తాకేలా చూసుకోవడం..
కరోనా రోగుల్లో వ్యాధినిరోధక తక్కువగా ఉన్నవారు ఎక్కువగా చనిపోతున్నారు. అందులో చాలామంది డీ విటమిన్ లోపం వల్ల ఎక్కువగా చనిపోతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. డీ విటమిన్ పైసా ఖర్చు లేకుండా సూర్యుని ద్వారా లభిస్తుంది. అందుకే రోజూ ఉదయం కొద్దిసేపు ఎండ తగిలేలా చూసుకోండి. కరోనాను జయించండి.
నగర వాతావరణంలో అవసరమైన సూర్య కిరణాలు అందక చాలా మంది ఎన్నో రుగ్మతలకు గురవుతున్నారు. చాలా మందికి పరిస్థితుల్లో విటమిన్-డి తగినంత అందడం లేదు. డి-విటమిన్ లోపంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారట. విటమిన్-డి సరిపడా ఉన్న వారు కొవిడ్-19 నుంచి త్వరగా కోలుకోగలరంటున్నారు.
కొవిడ్ మహమ్మారి విజృంభించడం వెనుక డీ విటమిన్ లోపమూ ఒక కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో కొవిడ్తో చనిపోయిన ఓ వ్యక్తికి విటమిన్ డి లోపం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అందుకే రోజూ కొద్దిసేపు ఉదయపు ఎండలో నిలుచోండి. కరోనాను జయించండి.
Powered by Froala Editor