బరువు తగ్గాలనుకుంటున్నారా...? అయితే ఈ మూడు రకాల గింజల గురించి తెలుసుకోండి..!

Suma Kallamadi

బరువు తగ్గడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. పెరిగిపోయిన పొట్టను తగ్గించడానికి మనుషులు ఎక్కువగా వ్యాయామం చేయడం, పర్ఫెక్ట్ డైట్ పాటించడం వంటివి చేస్తుంటారు. చాలామంది సంవత్సరాల తరబడి బరువు తగ్గేందుకు రకరకాలుగా కష్టపడుతుంటారు కానీ ఫలితం మాత్రం శూన్యం గా మిగులుతుంది. కొంతమందికి మాత్రం జిమ్ కి వెళ్లి వ్యాయామం చేసే వెసులుబాటు కూడా ఉండదు. అలాంటి వారి కోసమే ఇప్పుడు మేము చెప్పబోయే మార్గాలు కనిపెట్టబడ్డాయి. ప్రముఖ వైద్య బృందాల పరిశోధనల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన గింజలను ఆహారంగా తీసుకోవడం వలన బరువు పెరిగే ప్రక్రియ వేగవంతం అవుతుందట. జీవక్రియ సక్రమంగా పని చేసి శరీరంలో ఉన్న కొవ్వును ఈ గింజలు సమర్థవంతంగా కరిగిస్తాయట. ఇంతకీ అవేంటో ఒక సారి చూద్దాం. 


1. అవిసె గింజలు(ఫ్లాక్స్ సీడ్స్: flax seeds)

ఫ్లాక్స్ సీడ్స్ లో ఉండే పోషకాలు రక్తంలోని షుగర్ స్థాయిలను నియంత్రించడంలో, జీవక్రియ సక్రమంగా పని చేయడంలో కీలకమైన పాత్ర వహిస్తాయి. ఈ అవిసె గింజలు తినడం వలన గుండెకు మేలు జరుగుతుంది. అలాగే వీటిలో పిండి పదార్ధాలు, షుగర్ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఈ గింజలలో ఎక్కువ క్యాలరీలు కూడా ఉండవు కాబట్టి మీరు రోజు వారిగా ఎన్ని అవిసె గింజలను తిన్నా బరువు పెరగరు. 


2. చియా విత్తనాలు(Chia seeds)

చియా విత్తనాల్లో అనేకమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో ఎక్కువ క్యాలరీలు కూడా ఉండవు కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో చియా విత్తనాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం వలన బరువు తగ్గే అవకాశం ఉంటుంది. నీళ్ళల్లో నానబెట్టిన చియా విత్తనాలు క్రమం తప్పకుండా తినడం వలన పొట్ట ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది. పొద్దస్తమానం ఆకలి అయ్యే వారికి ఆకలి తగ్గిస్తుంది. ఫలితంగా లావుగా ఉన్న మీ పొట్ట సన్నగా అవుతుంది. 


3.సబ్జా విత్తనాలు(sabja seeds)

ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, శరీరానికి బాగా అవసరమైన కొవ్వులతో పాటు బరువు తగ్గడానికి గల కాంపౌండ్స్ కూడా సబ్జా విత్తనాల్లో పుష్కలంగా లభిస్తాయి. ఈ విత్తనాలలో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ అధిక స్థాయిలో లభిస్తాయి. ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ శరీరంలోని కొవ్వు కరగడానికి జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఫైబర్ కూడా సబ్జా విత్తనాల్లో ఎక్కువగా ఉండడం వలన ఇవి తింటే మీకు తరచుగా ఆకలి వేయదు. 


పైన ఇవ్వబడిన 3 రకాల విత్తనాలను తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలో మార్పులు చోటుచేసుకుని బరువు గమనించదగ్గ స్థాయిలో ఖచ్చితంగా తగ్గుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: