జీవిత సత్యాలు: మీ ఫెయిల్యూర్‌కు అసలు కారణం అదే..?

విజయానికి కావాల్సిందేమిటి.. కృషి, పట్టుదల, కఠోర శ్రమ.. ఇలా చాలా చెప్పొచ్చు. మరి అపజయానికి.. కారణం.. దీనికీ చాలా కారణాలు ఉన్నాయి. కానీ సింపుల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే.. మనలో మనకు తెలియకుండానే గూడు కట్టుకుని ఉన్న భయమే మన పరాజయానికి అసలు కారణం.

కష్టాలు ఎదురైనప్పుడు మనం ఎలా వాటిని ఎదుర్కొంటామో.. అదే మన విజయానికి పునాది అవుతుంది. కానీ చాలా మందిని కష్టాల్లో భయపెట్టేది భయమే. విపత్సమయాల్లో మనిషిని భయం ఆవహిస్తుంది. ఇది మీకెప్పుడైనా అనుభవం అయ్యిందా.. మనిషికి అడుగడుగునా భయాలే. అనుక్షణం రకరకాల భయాలు.

ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే.. మనిషి జయించాల్సింది మరణాన్నికాదు, మరణ భయాన్ని అని.. మనిషి మనసులో సంశయాలకు, వైరాగ్యాలకు మూల కారణం ఈ భయమే. ధీరుడైనవాడు సుఖదుఃఖాల్ని సమానంగా చూస్తాడు. అందుకే సకల సుగుణాల్లోనూ ధైర్యం గొప్పది. ధీరత్వం అంటే కార్యసాఫల్య సాధనం. కష్టకాలంలో కుంగిపోకూడదనేదే అసలైన జీవిత సత్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: