![కౌగిలించుకోవడం వల్ల ఈ ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/lifestyle/taurus_taurus/health-benefits-of-hugging-between-couples7250da65-4518-4863-b7d8-ded492ecf3c3-415x250.jpg)
కౌగిలించుకోవడం వల్ల ఈ ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
కౌగిలించుకోవడం.. సాధారణంగా మనం ఎక్కువగా సెలబ్రెటీలలో చూస్తుంటాము. లేదా సినిమాల్లో బాధలో ఉన్నవారిని దగ్గరికి తీసుకుని కౌగిలించుకుంటారు. దీంతో వారిలో బాధ తగ్గుతుందని అక్కడ అర్థం. అయితే ఇది కేవలం సినిమాలో మాత్రమేనని నిజమనుకోకండి. ఎందుకంటే.. ఇది నిజంగానే నిజం. అవును! ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా భార్యభర్తలు కౌగిలించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందొచ్చు. మరి అవేంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
![IHG](https://www.thehealthy.com/wp-content/uploads/2017/01/02-stress-health-benefits-hugging-505292200-graphixel.jpg)
వాస్తవానికి కౌగిలింత భాషకి అందని ఓ అనుభూతి అని చెబుతారు. అయితే భార్యభర్తలు కౌగిలించుకోవడం వల్ల వారిలో ఉండే మానసిక ఆందోళన పోతుందట. వారికి ఏమైనా బాధలు ఉన్నా ఇట్టే తగ్గిపోతాయట. ప్రేమగా ఇచ్చే కౌగిలింత వల్ల ఇద్దరిలోనూ ఉండే అనారోగ్య సమస్యలు పోయి ఆరోగ్యం కలుగుతుందట. అలాగే ప్రతి రోజు భార్యభర్తలు కౌగిలించుకోవడం వల్ల.. ఆ దంపతులు ఎక్కువ కాలం బ్రతుకుతారని అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా... చూడడానికి కూడా ఎంతో యవ్వనంగా ఉంటారని కూడా చెబుతున్నారు.
![IHG](https://knowlab.in/wp-content/uploads/2020/01/Beautiful-loving-couple-romance-in-nature-autumn-leaves-HD-Wallpaper-1920x1200-1920x1080.jpg)
ఇక గుండె సమస్యలు, షుగర్, బీపీ ఇలాంటి ఆరోగ్య సమస్యలన్నింటికీ కారణం ఒత్తిడి, డిప్రెషన్ ప్రధాన కారణంగా ఉంటుంది. అయితే కౌగిలింతలు ఆందోళన మరియు భయాలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా శరీరంలోని ఫ్రీ రాడికల్స్ కూడా నాశనమవుతాయి.. దీంతో చాలా వరకూ శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలు పడకుండా ఉంటాయి. కౌగిలింతలో ఉన్నప్పుడు స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ ఆరోగ్యానికి మేలు చేసే పలు హార్మోన్లు ఉత్పత్తి అవుతాయట. దీంతో వారిద్దరిలోనూ ఉండే మానసిక సమస్యలు దూరమవుతాయట. మరియు కౌగిలింత వల్ల దంపతుల్లో హై బీపీ కూడా తగ్గుతుందట.