జీవిత సత్యాలు: తొందర పడకోయ్‌.. సుందర వదనా.. కాస్త శాంతం..!

frame జీవిత సత్యాలు: తొందర పడకోయ్‌.. సుందర వదనా.. కాస్త శాంతం..!

మనం చూసేవన్నీ నిజాలు కాదు.. మన కళ్లు మనల్ని మోసం చేస్తాయి.. మనం వినేవన్నీ సత్యం కాదు.. మెరిసేదంతా బంగారమూ కాదు.. కానీ.. చాలా మంది వివేకంతో ఆలోచించరు. కనిపించగానే స్పందిస్తారు.. వినగానే ఆవేశపడిపోతారు.

ఇది నిజమా.. కాదా.. ఇది వాస్తవమా కాదా.. అసలు ఏం జరిగి ఉంటుంది.. ఇలాంటి ఆలోచనతో కూడిన విచక్షణ మరచిపోతారు. ఫలితంగా అపోహలు తలెత్తుతాయి. స్నేహాలు బీటలువారతాయి. ఆప్యాయతకు ఆవేశంతో కనుమరుగవుతాయి. గుర్తించేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

అందుకే తొందర వద్దు.. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు.. భావోద్వేగాలతో బంధాలను బలి పెట్టొద్దు. సహనం లోపించడంవల్ల కలిగిన అనర్థాలకు చరిత్ర, పురాణాలు సాక్ష్యమిస్తాయి. కోపంతో తీసుకున్న నిర్ణయాల కారణంగా గొప్పగొప్ప సామ్రాజ్యాలు బుగ్గిపాలయ్యాయి. గొప్ప నియంతలు మట్టికరిచారు.

ఆవేశం కారణంగా మనసులో అసహనం మొదలవుతుంది. ఆవేశం, అసహనం జతకలిస్తే.. అవి మనసులో అలజడి సృష్టిస్తాయి. ఈ రెండింటితో నిండిన మనసు అసూయాద్వేషాలకు నివాసంగా మారుతుంది. అందుకే.. శ్రీకృష్ణుడు పాండవులకు సహనం పాటించడంలోని గొప్పతనాన్ని వివరించాడు. నిజమైన యోగి లక్ష్యం స్థితప్రజ్ఞతని అని వివరిస్తాడు. ఇది మీకూ శిరోధార్యమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More