ఈ త‌రం యువ‌త‌: చదువు అంటే ఇంత చులకనా...?

praveen

నాటితరం  చదువుకు...నేటి తరం చదువుకు  ఎంతో  తేడా ఉంది... నాటి తరంలో చదువుకున్న వారికి ఎంతో నైపుణ్యం ఉండేది... నేటితరంలో పెద్ద పెద్ద చదువులు చదివిన నైపుణ్యాభివృద్ధి శూన్యం. ఎంతో టెక్నాలజీ పెరగడం చదువు చెప్పే విధానంలో మార్పులు వచ్చినప్పటికీ ఈ తరం యువతకు మాత్రం చదువు అంతగా ఎక్కడం లేదు. నాటి తరంలో చదువు అంటే మన జీవితానికి మార్గ నిర్దేశకం అని భావించేవారు.. కానీ ఈ తరం యువత మాత్రం చదువు అంటే అదొక వేస్ట్ టైం ఉన్నట్లుగా భావిస్తున్నారు. అందుకే రోజు రోజుకు కొత్త కాలేజీలు పుట్టుకొస్తున్నాయి గాని బాగా చదువుకొని నైపుణ్యత సాధించిన విద్యార్థులు మాత్రం ఎక్కడా కనిపించలేదు. 

 

 

 ఈ తరం యువతకు చదువంటే చులకనగా మారిపోయింది. చదువుకుంటే ఏమవుతుందిలే అంటూ చులకనగా తీసి పారెస్తున్నారు. ఓవైపు అమ్మానాన్నలు కష్టపడి తమ  కొడుకు ప్రయోజకులు కావాలని... లక్షలకు లక్షలు ఫీజులు కట్టి పెద్ద పెద్ద కాలేజీలో చేర్పిస్తుంటే. తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వారు కష్టపడి  చెమటోడ్చి కట్టిన ఫీజులను .. అన్నింటిని గంగ లో కలుపుతూ... చెడు తిరుగుళ్ళు లకు అలవాటు పడుతున్నారు ఈ తరం యువత. తల్లిదండ్రులు కష్టపడి ఫీజు కడుతున్నారు అని కూడా జాలి లేకుండా కాలేజీలు ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లడం శికార్లకు తిరగడం చెడు అలవాట్లకు బానిస గా మారిపోవడం చేస్తున్నారు. చదువు పేరు చెబితేనే చీదరించుకుంటున్నారు  ఈతరం యువత. 

 

 

 విద్యార్థి దశలో సరిగ్గా చదువుకోక తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు నేటి రోజుల్లో ఎంతో మంది . ఒకప్పుడు చదువులు చులకన చేయకుండా సరిగ్గా చదువుకొని ఉంటే ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉండేవాళ్ళం కదా అని  బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఎంతోమంది చదువుకు  ప్రాధాన్యతను ఇవ్వమని  తెలిపినప్పటికీ...వీళ్ళు  ఇలాగే చెబుతుంటారు నేను అలాగే చేస్తుంటా అనుకునే  వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు. ఇలా రోజురోజుకు ఆధునిక విద్య పెరుగుతోంది కాలేజీలు  పెరుగుతున్నాయి... కానీ  విద్యార్థులకు చదువుపై ఉన్న శ్రద్ధ మాత్రం పెరగడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: