జీవిత సత్యాలు: మీకు అస్సలు టైమ్ సరిపోవడం లేదా..?

frame జీవిత సత్యాలు: మీకు అస్సలు టైమ్ సరిపోవడం లేదా..?

ఇప్పుడంతా ఉరుకుల పరుగుల జీవితాలు.. మూడో తరగతి విద్యార్థి నుంచి ముప్పై ఏళ్ల కుర్రాడు దాకా.. పాతికేళ్ల భామ నుంచి యాభై దాటిన బామ్మ వరకూ ఎవరిని అడిగినా ఒక్కటే మాట.. టైమ్ లేదు.. టైమ్ లేదు.. అవును మనకు సమయం అస్సలు సరిపోవడం లేదు. మరి ఎందుకు ఇలా జరుగుతోంది. అసలు మన సమయం ఎక్కడ దాక్కుంటోంది.

ఈ ప్రశ్నకు సమాధానం కేవలం మనకు సమయంపై అదుపులేకపోవడమే అని చెప్పాలి. ఎందుకంటే.. అడుక్కుతినే వాడి నుంచి అంబానీ వరకూ అందరికీ ఉన్నది ఆ 24 గంటలే. ఎన్ని కోట్లు వెచ్చించినా కాలాన్ని ఎవరూ కొనుక్కోలేరు. మరి మన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి. అందుకు మార్గాలేంటి..?

సీరియస్ గా ఆలోచిస్తే.. చాలా సింపుల్ మార్గాలు ఉన్నాయి. మీరేం చేయాలనుకుంటున్నారో ఆ పనులను ఓ పట్టికలా తయారుచేసుకోవాలి. అది ఎలాంటి పనైనా సరే.. ఉదాహరణకు పిల్లల పరీక్షలు, సెలవులు, పండగలు, పుట్టినరోజులు, పెళ్లిరోజులు... ఇలా ప్రతిదీ ఆ క్యాలండర్‌లో నమోదు చేసుకోవాలి. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన క్యాలండర్‌ను కూడా తయారుచేసుకోవాలి.

ప్రతిదీ క్యాలెండర్‌లో పెట్టుకోవాలి. ప్రతి నెలా వీటిని చెక్‌ చేసుకుంటూ ఉండాలి. 24 గంటల సమయాన్ని గంటల లెక్కన విభజించుకుని.. ఓ వారం రోజుల పాటు మీరు ఏం చేస్తున్నారో నమోదు చేయండి.. అప్పుడు లెక్క తేలుతుంది మీరు ఎంత సమయం వృథా చేస్తున్నారో.. అప్పుడు ఆ మిగిలిన సమయాన్ని చక్కగా ప్లాన్ చేసుకోండి. ఈ మార్పు మీరే గమనిస్తారు. కాకపోతే సీరియస్ గా అమలు చేయాలంతే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: