పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాల నుంచి తీసే నూనెను వంటల కోసం వాడుతూ ఉంటాం. ఇది ఆరోగ్యానికి చాలమంచిది అని అంటూ ఉంటారు. అయితే వాస్తవానికి పొద్దు తిరుగుడు విత్తనాలను నేరుగా తింటేనే మనకు ఎంతో ప్రయోజనం ఉంది అని లేటెస్ట్ అధ్యయనాలు చెపుతున్నాయి.
మన శరీరానికి కావల్సిన కీలక పోషకాలను అందించడంతోపాటు పలు అనారోగ్య సమస్యలను నయం చేయడంలోనూ పొద్దు తిరుగుడు విత్తనాలు అమోఘంగా పనిచేస్తాయి అని పరిశోధనలు తేలియచేస్తున్నాయి. పొద్దు తిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. అలాగే కీళ్లనొప్పులు, ఆస్తమా వంటి సమస్యలు కూడ ఈ విత్తనాలు తినడం వల్ల ఎన్నో ప్రయోనాలు కలుగుతాయి.
ముఖ్యంగా డయాబెటిస్‌ను అదుపు చేసే గుణం పొద్దు తిరుగుడు విత్తనాలకు ఉంటుందని పరిశోధనల్లో బయటపడటంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ విత్తనాలు పై పడింది. అదేవిధంగా పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా చూడడంలో ఈ విత్తనాలు మెరుగ్గా పనిచేస్తాయి. హైబీపీని నియంత్రిచడంలో మన శరీరంలోని రక్త సరఫరా మెరుగు పరచడంలో ఈవిత్తనాలు ఎంతో మేలు చేస్తాయి.
పొద్దు తిరుగుడు విత్తనాలలో ఉండే మాంగనీస్ ఎముకల దృఢత్వానికి ఎంతో సహకరిస్తుంది. ముఖ్యంగా చర్మాన్ని సంరక్షించే గుణాలు పొద్దు తిరుగుడు విత్తనాల్లో పుష్కలంగా ఉంటాయి అని తేలడంతో బ్యూటీషియన్స్ కూడ ఈ పొద్దు తిరుగుడు విత్తనాల పట్ల ఆసక్తి కనపరుస్తున్నారు. దీనితో పొద్దు తిరుగుడు పూల నూనె కంటే ఈవిత్తనాల పట్ల ప్రస్తుతం అందరికీ ఆసక్తి పెరిగింది..