50 రోజుల్లో చనిపోవడం ఎలా..? నేడే చదవండి..!

Vasishta

ఇంటర్నెట్ యుగం స్టార్ట్ అయ్యాక ఎన్నోరకాల గేమ్స్ పిల్లల్ని ఆకట్టుకంటున్నాయి. స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ఆ గేమ్స్ అరచేతిలోకి వచ్చేశాయి. ముఖ్యంగా పిల్లలు ఈ గేమ్స్ ఉచ్చులోపడి ప్రపంచాన్ని మరిచిపోతున్నారు. ఇందులో కొన్ని గేమ్స్ ఆహ్లాదాన్ని పంచితే.. మరికొన్నిమాత్రం ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. ఇలాంటిదొకటి ఇప్పడు సంచలనం సృష్టిస్తోంది. అదే బ్లూ వేల్ ఛాలెంజ్.


బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ ఆడితో ప్రాణాలు పోవాల్సిందే. ప్రాణాలు తీసుకునేలా ప్రేరేపిస్తుందీ గేమ్. ఇప్పటికే దీని బారినపడి చాలా మంది పిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈరోగం ఇప్పుడు మన దేశంలోకీ పాకింది. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొంతమంది చిన్నారులు దీని బారిన పడడంతో ప్రభుత్వం అలెర్ట్ అయింది. ఈ గేమ్ కు సంబంధించిన లింకులను తొలగించాలని సర్వీస్ ప్రొవైడర్లకు సూచించింది.


బ్లూ వేల్ ఛాలెంజ్ లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. 50 రోజులపాటు సాగే ఈ గేమ్ లో రోజుకొక టాస్క్ ఇస్తుంటారు. టాస్క్ పూర్తి చేసుకుంటూ వెళ్లాలి. మొదట్లో తిమింగలం బొమ్మ వేయమంటారు.. ఆ తర్వాత దాన్ని శరీరంపై వేసుకోవాలి అంటారు.. అలా స్టార్ట్ అయ్యే గేమ్.. ఆ తర్వాత పీక్ స్టేజ్ కు చేరుకుంటుంది. అర్ధరాత్రిపూట బయటకు వెళ్లాలనడం, కళ్లకు గంతలు కట్టుకుని పరుగెత్తడం.. లాంటి టాస్కులను ముందుంచుతారు. అలా మొత్తం 50 రోజులపాట టాస్కులను గెలుస్తూ వెళ్లాలి.


50 టాస్కులు పూర్తి చేసిన తర్వాత ప్రాణాంతకమైన టాస్కును అప్పగిస్తారు. ఎత్తైన బిల్డింగ్ పైకి ఎక్కి దూకమనడం, మూతికి మాస్క్ వేసుకోవాలనడం, ఏదైనా సుదూర ప్రాంతానికి వెళ్లాలనడం.. లాంటి టాస్కులు అప్పగిస్తారు. ఇలాంటి టాస్కులను ఫేస్ చేసిన కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైలో 9వ తరగతి చదువుతున్న కుర్రాడు బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయాడు. సోలాపూర్ లో ఓ అబ్బాయి ఇంట్లో నుంచి పారిపోయాడు. మధ్యప్రదేశ్ లో ఓ కుర్రాడు బిల్డింగ్ పైనుంచి దూకపోయాడు. పశ్చిమబంగలో ఓ కుర్రాడు ఊపిరి ఆడకుండా చేసుకుని బాత్రూమ్ లో శవమై తేలాడు.


ప్రాణాంతకమైన బ్లూ వేల్ గేమ్ పై అలెర్ట్ కాకపోతే మరింతమంది పిల్లలు ప్రాణాలు కోల్పోతారని భావించి ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే ఆ లింకులను తొలగించాలని ఆదేశించింది. ఆ సైకో గేమ్ లింకులను వెంటనే తొలగించాలంటూ గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్ కంపెనీలతోపాటు సోషల్ మీడియా సంస్థలకు కూడా నోటీసులు పంపించింది.


రష్యాకు చెందిన ఫిలిప్ బుడేకిన్ అనే 22 ఏళ్ల స్టూడెంట్ ఈ సైకో గేమ్ సృష్టికర్త. ఈ గేమ్ వాడిన వాళ్లంతా దానికి అడిక్ట్ అయిపోవడం, సైకోలుగా మారిపోతుండడం, చివరకు ప్రాణాలు కోల్పోతుండడంతో ఆ స్టూడెంట్ ను యూనివర్సిటీ పంపించేసింది. ఇప్పుడు ఫిలిప్ జైల్లో ఉన్నాడు. ఈ గేమ్ ఎందుకు రూపొందించావని అడిగితే.. శుభ్రమైన సమాజాన్ని తయారు చేసేందుకే ఇది చేసినట్లు చెప్పుకొచ్చాడు ఫిలిప్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: