కొత్త ఇంట్లో పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా..?

Vasishta

కొత్త ఇల్లు కొన్నా.. లేదా కట్టినా.. చేరేటప్పుడు ఎన్నో సంప్రదాయాలు పాటిస్తుంటారు. అందులో ముఖ్యంగా చేపట్టేది పాలు పొంగించడం. ఇది అనాదిగా వస్తోంది. పాలు పొంగించడం సంప్రదాయమని చెప్తారే కానీ.. దాని వల్ల ఉపయోగమేంటో చాలా మంది చెప్పలేరు.


పాలు పొంగించే ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయని నమ్మకం. సంపదకు చిహ్నం లక్ష్మిదేవి. ఆమె హృదయేశ్వరుడు పాల సాగరాన పవళించిన శ్రీహరి. అందుకే పాలు పొంగితే.. భోగభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం.


కొత్తగా ఇంట్లే చేరేటప్పుడు ముందు ఆవును ప్రవేశపెడ్తారు. తర్వాయ ఇంటి యజమాని వెళ్తాడు. గోవు కామధేనువు. ఆవు తిరిగిన ఇంట్లో ఎలాంటిదోషాలు ఉండవని ప్రతీతి. ఇంటి ఆడపడుచులను పలిచి వారి చేత పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తారు. ఆ పాలతో అన్నం వండి వాస్తుపురుషునికి సమర్పిస్తారు.


పాలు పొంగించిన ఇంట్లో సంపదకు, సుఖశాంతులకు లోటుండదు. ఇంటి ఆడపడచులకు ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఇళ్లలో సఖ్యత నెలకొంటుంది. సమైక్య జీవనానికి ఇది నాంది పలుకుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: