క్రైమ్ జర్నలిస్టుల జీవితాలు తెలిస్తే షాక్ అవుతారు..!

నిత్యం పోరాటం.. అనునిత్యం ఆరాటం క్షణం తీరిక లేని అక్షరపోరాటం. ఆ నిత్య యుద్ద సమరంలో సమిధలవుతున్న రాతగాడే జర్నలిస్ట్.. సంస్థ కోసం తపన పడుతు.. తనను తాను నిలువునా కరిగించుకుంటున్న అక్షర శ్రామికుడు జర్నలిస్ట్ . ఈ జర్నలిజంలో క్రైం రిపోర్ట్ మరింత సమిదగా మారుతున్నాడు. అంపశయ్యపై పవలిస్తూ రోగాల కుంపటిగా తన శరీరాన్ని మార్చుకుంటున్నాడు క్రైం జర్నలిస్ట్. 


ఇది మేము చెపుతున్న మాటలు కాదు సర్వేలు చెపుతున్న భయకరమైన నిజాలు. పోటీ ప్రపంచంలో వార్తను ముందుగా ప్రపంచానికి అందివ్వాలన్న కసిలో అసలు ఎంత సమయం తన సొంత జీవితానికి ఉపయోగిస్తున్నాడో కూడా మరచిపోతున్నాడు.  ఏ అర్థరాత్రి ఏ వార్త వినాల్సి వస్తుందో అని.. నిత్యం అలర్ట్ గా ఉంటూ తన శరీరం పై అజాగ్రత్తతో గడుపుతున్నాడు. అందరికంటే ముందుండాలనే తాపత్రయం క్రైం రిపోర్టర్లను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. వ్యక్తిగత జీవితం అంటూ లేకుండా చేస్తోంది. 


ఇంట్లో ఉన్నా.. బయట ఉన్నా.. సినిమా చూస్తున్నా.. స్నేహితుడి పెళ్లిలో ఉన్నా.. బాత్రూంలో ఉన్నా.. చివరకు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా సరే.. అనుక్షణం ఆన్ డ్యూటీయే.  సెల్ ఫోన్ ఎప్పుడూ ఆన్ చేసి ఉంచాల్సిందే. లేదంటే ఏక్షణంలో ఏ వార్త కోల్పోతామో ఏ బ్రేకింగ్ ను మిస్  అయిపోతామోననే భయం. చివరకు ఫోన్ బ్యాటరీ అయిపోతున్నా.. మరో బ్యాటరీ మార్చాల్సిందే. లేదంటే చార్జింగ్ కోసం వెతుకులాడాల్సిందే. ఈ పరిస్థితి క్రైం రిపోర్టర్లను యంత్రంలా మార్చేసింది. 


ఇప్పుడు అదే పరిస్థితి క్రైం రిఫోర్టర్ ని రోగాల కుప్పగా మారుస్తోంది. పని ఒత్తిడి, నిద్ర లేమి, తీవ్ర పోటి నేపథ్యంలో మిగిత జర్నలిస్ట్ లతో పోలీస్తే క్రైం జర్నలిస్ట్ జీవనం మరింత దుర్భంరంగా ఉన్నాయని చెపుతున్నాయి సర్వేలు. దేశ వ్యాప్తంగా ఉన్న  ఛానళ్ల క్రైం రిపోర్ట్ ర్లు కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా ఉండలేకపోతున్నారని చెబుతోంది. కోపం, అసహనం, ద్వేషం రోజు రోజుకు వీరిలో పెరిగిపోతోందని మానసిక నిపుణుల అంచనా. 


ఇక మానసిక నిపుణులు చెపుతున్న వివరాల ప్రకారం క్రైం జర్నలిస్ట్ గా విధులు నిర్వర్తించిన 15 శాతం మంది వ్యక్తుల్లోఒత్తిడి పెరిగి కోపం, విసుగు, చిరాకు, తారస్థాయికి చేరి చివరకు ఆత్మహత్యలు చేసుకోవాలనే నిర్ణయానికి వస్తున్నట్టు చెపుతున్నారు. ఇక ఈ *ఒత్తిడిని తగ్గించుకునేందుకు దురాలవాట్లకు అలవాటు పడుతు ఆరోగ్యాన్ని ఇంకా నాశనం చేసుకుంటున్నారని చెపుతున్నారు.  ఇక మీడియా ప్రతినిధులు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల మీద సర్వే చేస్తున్న అనేక సంస్థలు చెపుతున్న భయంకరమైన నిజం ప్రపంచ వ్యాప్తంగా క్రైం జర్నలిస్ట్ ల సగటు వయస్సు 38 మాత్రమే. 


ఒత్తిడి నుంచి తనకు తానుగా భయటపడక పోతే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తున్నాయి.డబ్బు ఆశతో కొందరు అధికారులు   చేసే మానసిక దాడులు...అవినీతి అక్రమాల.. పైమాట్లాడకూడదు.లేదంటే. కేసులు అప్పటిదాకా అలా సపోర్ట్ చేసిన మీడియా  యాజమాన్యం డబ్బుకోసం జర్నలిస్ట్ ను బలి చేసి తప్పుకుంటాడు..సాలరీ సమయానికి రాదు..అడిగితె ఏదొరకంగా కేసుల్లో ఇరికిస్తారు ..ఎవ్వరు సపోర్ట్ చెయ్యరు ఎవరికీ వారు నాకెందుకు లే అని మౌనం వహిస్తారు. ఇవీ క్రైమ్ రిపోర్టర్ల కష్టాలు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: