ఎండు ద్రాక్షలో పోషకాహర విలువలు !

Seetha Sailaja
ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు ఎండు ద్రాక్షగా మారుతుంది. ఈ ఎండు ద్రాక్షనే వాడుక భాషలో కిస్ మిస్ అని కూడ అంటున్నాం.  ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ద్రాక్షలో 80 శాతంను వైన్ తయారీలో వాడుతారు. మిగిలిన భాగంలో ఏడు శాతాన్ని ఎండు ద్రాక్షగా ఉపయోగిస్తారు. ఈ ఎండు ద్రాక్షలో ఎన్నో పోషక ఆహార విలువలు ఉన్నాయి. మహిళలు ప్రతిరోజూ కిస్‌మిస్ పండ్లు తినుటవలన యూరినల్‌లో ఆమోనియా పెరగకుండా రాళ్ళు చేరకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కిస్‌మిస్ పండ్లను తరుచుగా తినడం వలన శరీరములో పులుపును స్వీకరించే శక్తిగల ఆమ్లాలను సమానం చేసి జ్వరము రానీయకుండా చేస్తుంది అని పరిశోధనలు చెపుతున్నాయి. మన శరీర రక్తం శుభ్రపడటానికి నరాలకు బలము చేకూరటానికి కిస్‌మిస్ ఎంతగానో ఉపయోగ పడుతాయి. గొంతు వ్యాధితో బాధపడేవారు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఎండు ద్రాక్ష శరీరంలోని శ్వాసనాళికలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. దీనితో ఉపశనం కలుగుతుంది మలబద్దకంతో బాధపడేవారు ప్రతిరోజూ రాత్రిపూట పడుకునేముందు ఎండు ద్రాక్షతో పాటు సోంపును కలిపి తీసుకుంటే మలబద్దకంనుంచి ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెపుతారు. 

ఈ ఎండు ద్రాక్షలో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తంలోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. ఇది  రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడుతుంది. ఎండు ద్రాక్షలో ఉన్న పాలీఫినాలిక్ ఫైటో నూట్రియంట్శ్ మూలాన యాంటీఅక్షిడెంట్ గా పనిచేస్తుంది. ఇందులో ఉన్న పొటాసియం , మెగ్నీషియం పుష్కలముగా ఉండటం వలన శరీరానికి ఎంతో మంచి చేస్తుంది. కిస్మిస్ లో ఉన్న ఫ్రక్టోజ్,  గ్లూకోజ్ అధిక శక్తిని ఇచ్చి బరువును పెంచే దిశగా శక్తి మూలకముగా పనిచేస్తుంది. తక్కువ బరువు గల వ్యక్తులు డ్రై ఫ్రూట్స్ గా ఎండుద్రాక్షను తింటే మంచిది . 

ఎండు ద్రాక్షలో ఫిబర్ పుష్కలముగా ఉన్నందున విరోచనము సాఫీగా అవడానికి ఎంతో ఉపయోగ పడుతుంది. బాదం, ఎండు ద్రాక్ష, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికే కాదు గుండెకు ఎంతో మేలు జరుగుతుందని న్యూట్రీషన్లు చెపుతున్నారు. కొంచెం పులుపు కొంచం తీపి కలయికగా ఉండే ఎండు ద్రాక్షను పిల్లల నుండి పెద్దవాళ్ళు వరకు తాము తీసుకునే ఆహారంలో ఉపయోగిస్తే అనేక వ్యాధుల నుండి బయట పడటమే కాకుండా మన ఎముకల పుష్టికి కూడ ఎంతో సహకరిస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: