ఉప్పు ఎంత వాడితే గుండెకు మంచిది?

Purushottham Vinay
మనం చేసే వంటలకు మంచి రుచిని తీసుకురావడంలో ఉప్పు మనకు సహాయపడుతుంది. ఉప్పు మన శరీరానికి చాలా అవసరం. మన శరీరంలో తగినంత నీరు ఉండేలా చేయడంలో, నరాల వ్యవస్థ సరిగ్గా పని చేసేలా చేయడంలో ఇంకా కండరాల సంకోచ వ్యాకోచాలను అదుపులో ఉంచడంలో ఇలా చాలా రకాలుగా ఉప్పు మనకు సహాయపడుతుంది. ఉప్పు మన ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికి దీనిని చాలా మొత్తంలో తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. ఇది  గుండె జబ్బులకు దారి తీస్తుంది.ఇక ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే ద్రవాల స్థాయిలో హెచ్చు తగ్గులు వస్తాయి. రక్తపోటు పెరగడం వల్ల రక్తనాళాలపై ఇంకా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది క్రమంగా గుండె పోటు ఇంకా హార్ట్ ఎటాక్ కు దారి తీస్తుంది. కాబట్టి మనం తగిన మొత్తంలో ఉప్పును తీసుకోవడం చాలా అవసరం. అందుకు మనం రోజుకు 2,300 మిల్లీ గ్రాములు అనగా ఒక టీ స్పూన్ ఉప్పును మాత్రమే తీసుకోవాలి. అధిక రక్తపోటు ఇంకా గుండె జబ్బులతో బాధపడే వారు 1500 మిల్లీ గ్రాముల ఉప్పును మాత్రమే తీసుకోవాలి. ఇలా తక్కువ  ఉప్పును తీసుకోవడం వల్ల రక్తనాళాలపై ఎక్కువగా ఒత్తిడి పడకుండా ఉంటుంది.ఇంకా అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.


 మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మనం తప్పకుండా ఉప్పును తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. తాజాగా ఉండే కూరగాయలను ఇంకా పండ్లను తీసుకోవాలి. ప్యాకెట్ లలో నిల్వ ఉన్న ఆహారాలను ఇంకా ప్రాసెస్ చేసిన ఆహారాలను అస్సలు తీసుకోకూడదు.వీటిలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. అయితే తాజా కూరగాయలతో కూరలు వండడం వల్ల ఉప్పు వాడకం తగ్గుతుంది. అలాగే బయట ఆహార పదార్థాలను కొనేటప్పుడు వాటిలో సోడియం క్లోరైడ్, మోనో సోడియం గ్లుటామేట్, సోడియం బైకార్బోనేట్ ఇంకా బెంజోయేట్ పదార్థాల వాడకం ఎంత శాతం ఉందో చూసి కొనుగోలు చేయాలి.అలాగే తక్కువ సోడియం లేదా సోడియం లేని పదార్థాలను కొనడానికి ప్రయత్నించాలి.ఇంకా అలాగే వంట్లలో ఉప్పుకు ప్రత్యమ్నాయంగా ఇతర ఆహారాలను ఉపయోగించాలి. వంట్లలో అల్లం, వెల్లుల్లి ఇంకా నిమ్మరసం వంటివి వేయడం వల్ల వంటల్లో ఉప్పు తక్కువగా పడుతుంది. ఈ విధంగా వంట్లలో ఉప్పును తక్కువగా వాడడం వల్ల మన గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు మన శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: