ఉమ్మెత్త: ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

Purushottham Vinay
ఉమ్మెత్త గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీని గురించి మనం మన చిన్నప్పుడు స్కూల్లో పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాము. ఇక మన ఇంటి చుట్టే పరిసరాల్లో ఉండే అద్భుతమైన ఔషధ మొక్కలల్లో ఇది కూడా ఒకటి. ఈ ఉమ్మెత్త మొక్కను మనలో చాలా మంది కూడా చూసే ఉంటారు.దీనిని చాలా మొండి వ్యాధులను తగ్గించడంలో  ఔషధంగా ఉపయోగిస్తారు. పొడవాటి తెల్లటి పూలను ఇంకా ముళ్లు కలిగిన కాయలను ఇది కలిగి ఉంటుంది.అలాగే ఉమ్మెతలో కూడా తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త అని రెండు రకాలు ఉంటాయి. తెల్ల ఉమ్మెత్తతో పాటు నల్ల ఉమ్మెత కూడా చాలా రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అయితే ఎన్ని ఔషధ గుణాలు కలిగి ఉన్నప్పటికి దీనిని బాహ్యంగానే ఉపయోగించాలి. లోనికి మాత్రం దీనిని ఔషధంగా తీసుకోకూడదు. నల్ల ఉమ్మెత్త ఆకులను సేకరించి వాటిని శుభ్రంగా కడగాలి. ఆ తరువాత వీటికి నువ్వుల నూనె రాసి వేడి చేయాలి. ఈ ఆకులు గోరు వెచ్చగా అయిన తరువాత నొప్పులపై ఉంచి కట్టుకట్టాలి.ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, సెగ గడ్డలు ఇంకా అలాగే స్త్రీలల్లో వచ్చే స్థనాల వాపు వంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి.


ఇంకా అలాగే తలనొప్పితో బాధపడుతున్నప్పుడు ఉమ్మెత్త ఆకులను వాడడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది.ఈ ఉమ్మెత్త ఆకులకు నూనె రాసి తలపై ఉండచం వల్ల క్రమంగా తలనొప్పి అనేది తగ్గుతుంది. పిచ్చి కుక్క కాటు వల్ల కలిగే విష ప్రభావాన్ని తగ్గించడంలో కూడా ఈ ఉమ్మెత్త చెట్టు మనకు చాలా సహాయపడుతుంది.ఈ ఉమ్మెత్త ఆకులను నూరి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని కుక్క కాటుకు గురి అయిన చోట రాయాలి. ఇక ఇలా చేయడం వల్ల విష ప్రభావం తగ్గుతుంది. ఇంకా అదేవిధంగా ఆస్థమాతో బాధపడే వారు ఎండిన నల్ల ఉమ్మెత్త ఆకులను కాల్చగా వచ్చిన పొగను పీల్చడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా అదే విధంగా నల్ల ఉమ్మెత్త చెట్టు వేరును పేస్ట్ లాగా చేసుకోని ఈ పేస్ట్ ను మొలలపై రాయడం వల్ల మొలలు ఎండిపోయి ఈజీగా రాలిపోతాయి.అలాగే ఈ నల్ల ఉమ్మెత్త ఆకుల రసాన్ని అరి కాళ్లలో రాయడం వల్ల అరికాళ్లల్లో మంటలు ఇంకా తిమ్మిర్లు కూడా ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే చర్మ వ్యాధులను తగ్గించడంలో కూడా ఈ ఆకుల రసం బాగా సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: