ఈ టేస్టీ డిష్ ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

Purushottham Vinay
రాగులను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని లాభాలు కలుగుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అందరికీ తెలిసిందే. రాగుల్లో చాలా రకాల పోషకాలు ఉంటాయి.ఈ రాగులను పిండిగా మార్చి దాంతో జావ లేదా అంబలి తయారు చేసి వేసవిలో తాగితే శరీరం చాలా చల్లగా మారుతుంది. ఇంకా వేడి కూడా తగ్గుతుంది. అలాగే వేసవి తాపం నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది.రాగులను తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలను పొందవచ్చు. అయితే కొందరు రాగులను తినేందుకు అస్సలు ఇష్టపడరు. కానీ వాటితో టిఫిన్లు తయారు చేసి కూడా తినవచ్చు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. పైగా  మనకు ఆరోగ్యకరం కూడా. ఈ క్రమంలోనే  రాగి ఊతప్పం కూడా రుచి బాగానే ఉంటుంది.కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది.


ఈ రాగి ఊతప్పం తయారీకి కావల్సిన పదార్థాలు..రాగి పిండి – రెండు కప్పులు, జీలకర్ర – ఒక టీస్పూన్‌, పెరుగు – అర కప్పు, అల్లం తురుము – ఒక టేబుల్‌ స్పూన్‌, పచ్చి మిర్చి – 2, ఉప్పు – రుచికి సరిపడా, టమాటా ముక్కలు – ఒక కప్పు, ఉల్లికాడలు ఇంకా క్యాప్సికం ముక్కలు – ఒక కప్పు తీసుకోవాలి.


రాగి ఊతప్పం తయారు చేసే విధానం విషయానికి వస్తే..రాగి పిండిలో జీలకర్ర, పెరుగు, అల్లం తురుము, సన్నగా తరిగిన పచ్చి మిర్చి ముక్కలు ఇంకా ఉప్పు.. అన్నీ వేసి బాగా కలపాలి. ఆ తరువాత తగినన్ని నీళ్లు పోసి దోశ పిండిలాగా కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని పెనం మీద ఊతప్పంలా వేసి దాని మీద కూరగాయల ముక్కలు వేసి రెండు వైపులా కూడా కాల్చుకోవాలి. దీంతో చాలా రుచిగా ఉండే రాగి ఊతప్పం రెడీ అవుతుంది. దీన్ని మనం ఏదైనా చట్నీతో తినవచ్చు. పొద్దున్నే మీకు టిఫిన్‌ చేసేందుకు సమయం లేనప్పుడు ఇలా రాగి ఊతప్పంను వెంటనే అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. దీన్ని అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇది ఆరోగ్యకరం కూడా. కాబట్టి తరచూ దీన్ని ఆహారంలో భాగం చేసుకోండి. దీంతో చాలా ప్రయోజనాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: